ముఖ్యకూడళ్ళ సుందరీకరణపై మున్సిపల్ కమీషనర్ ను కలిసిన నగర కాంగ్రెస్ బృందం

ముఖ్యకూడళ్ళ సుందరీకరణపై
మున్సిపల్ కమీషనర్ ను
కలిసిన నగర కాంగ్రెస్ బృందం

  • నెహ్రూ, రాజీవ్ గాంధీ, చొక్కారావు విగ్రహాలను వెంటనే ఏర్పాటుచేసి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరిన నాయకులు
  • అంతర్గత రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి వర్షాకాలం వచ్చేలోపు కొన్నయినా పూర్తి చేయాలి

కరీంనగర్ బ్యూరో, మే 12 (విశ్వం న్యూస్) : నగరంలోని ముఖ్య కూడళ్ళలో విగ్రహాల ఏర్పాటు విషయంలో వివక్ష చూపవద్దని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమీషనర్ ను కలిసి కోరడం జరిగింది. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాజీవ్ చౌక్ ను పూర్తి స్థాయిలో సుందరీకరించి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని,సావరన్ స్ట్రీట్ కూడలి వద్ద నెహ్రూ విగ్రహం వెంటనే ఏర్పాటు చేయాలని మరియు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు చొక్కారావు విగ్రహానికి ప్రాధాన్యత తగ్గించవద్దని కొరినామన్నారు.

నగరంలో అంతర్గత రోడ్లు మురికికాలువలు అధ్వాన్నంగా ఉన్నాయని వర్షాకాలం వచ్చేలోపు కొన్నయినా పూర్తి చేయాలని కోరామన్నారు.ఈ కార్యక్రమంలో మడుపు మోహన్, గుండాటీ శ్రీనివాస్ రెడ్డి, పొరండ్ల రమేష్, కీర్తి కుమార్,షేక్ షేహెన్ష, అష్రాఫ్ ఖురేషి, గాదె శివరాం, షాహిద్ అఫ్రిది, అబ్దుల్ భారీ,కత్రి కమల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *