108, అమ్మఒడి వాహనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

108, అమ్మఒడి వాహనాలను
ప్రారంభించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్, ఆగస్టు 1 (విశ్వం న్యూస్) : 108 అత్యవసర వాహనాలు, 102 అమ్మ ఒడి వాహనాలు, ఉచిత శవవాహనాలతో కూడిన 466 సరికొత్త వాహనాలను మంగళవారం పీపుల్స్‌ ప్లాజాలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభోత్సవం తర్వాత, వాహనాలు అన్ని జిల్లాలకు అధునాతన సౌకర్యాలతో, ప్రతి కేటగిరీ కింద కనీసం ఒక కొత్త వాహనం ఉండేలా చూడడం జరిగింది.

  • అనంతరం అంబులెన్సుల
    ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి
    మంత్రి హరీశ్ రావు ప్రసంగించారు.
  • అత్యవసర సేవలు అందించే 466 అధునాతన వాహనాలను ఒకేరోజు ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉంది.
  • తెలంగాణ ఏర్పడే నాటికి 316 అంబులెన్సులు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 455 కు పెరిగింది.
  • గతంలో లక్ష మందికి ఒక 108 వాహనం ఉంటే.. ఇప్పుడు 75 వేలకు ఒక వాహనం అందుబాటులోకి వచ్చింది.
  • అమ్మ ఒడి ద్వారా రోజుకు 4 వేల మందికి, 108 ద్వారా రోజుకు 2 వేల మందికి సేవలు అందుతున్నాయి.
  • నియోజక వర్గానికి 100 పడకల ఆసుపత్రులను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారు.
  • జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నాలుగు టీమ్స్, వరంగల్ హెల్త్ సిటీ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50 వేల పడకలు అందుబాటులోకి వచ్చాయి.
  • కరోనా కాదు దాని తాత వచ్చినా ఎదుర్కొనెలా రాష్ట్ర వైద్య రంగం పటిష్టం అయింది.
  • మాకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా కేసిఆర్ ప్రభుత్వం అండగా ఉన్నదనే భరోసా కలిగింది.
  • బిజెపి, కాంగ్రెస్ రాష్ట్రాల్లో స్కాములు ఉంటే.. తెలంగాణలో స్కీములు ఉన్నాయి.
  • బిజెపి, కాంగ్రెస్ రాష్ట్రాల్లో కొట్లాటలు, కరెప్షన్ తప్ప అభివృద్ధి శూన్యం.
  • ఆశ కార్యకర్తల సెల్ ఫోన్ బిల్లును ఇకపై ప్రభుత్వమే కడుతుంది.
  • కొత్తగా హైదరాబాద్ పరిధిలో నియమితులైన ఆశాలకు స్మార్ట్ ఫోన్లు
  • గతంలో అంబులెన్స్ సగటు సమయం 30 నిమిషాలు ఉంటే.. ఇప్పుడు 15 నిమిషాలకు తగ్గింది.
  • అంబులెన్స్ లను డైనమిక్ పొజిషన్ లో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాం.
  • 108 ఉద్యోగుల వేతనాలు 4 స్లాబులుగా పెంచుతున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *