ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ, రామచంద్ర మిషన్ ప్రతినిధులతో సిఎం కేసీఆర్

ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ, రామచంద్ర మిషన్ ప్రతినిధులతో సిఎం కేసీఆర్

హైదరాబాద్, జనవరి 23 (విశ్వం న్యూస్) : ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ, రామచంద్ర మిషన్ ప్రతినిధులు ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. గ్రామీణ అభివృద్ది, వ్యవసాయ రంగంతో పాటు పలు సామాజిక రంగాల్లో సేవలు అందిస్తున్న, ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ, రామచంద్ర మిషన్ ప్రతినిధులు ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. తాము హైదరాబాద్ లో త్వరలో నిర్వహించనున్న ఆధ్యాత్మిక సమ్మేళనానికి హాజరు కావాల్సిందిగా మిషన్ ప్రస్థుత ఆధ్యాత్మిక గురువు కమలేష్ పటేల్, సిఎం కేసీఆర్ ను ఆహ్వానించారు.

తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఈ సందర్భంగా సిఎం గారికి వారు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *