సీఎం కరీంనగర్ పర్యటన…


గంగుల కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం
ఘన స్వాగతం పలికిన మంత్రులు, పార్టీ శ్రేణులు, అధికారులు
తిమ్మాపూర్, జనవరి 16 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ నుండి హెలిక్యాప్టర్ లో కరీంనగర్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను పరామర్శించారు. కరీంనగర్ లో సోమవారం గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య దశదిన కర్మ కార్యక్రమం కొండ సత్యలక్ష్మీ ఫంక్షన్ హాల్ నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల మల్లయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళు లర్పించారు. అనంతరం మంత్రి గంగులను, కుటుంబ సభ్యులను సీఎం కెసిఆర్ ఓదార్చారు. ఈ కార్యక్ర మంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, వొడితెల సతీష్ బాబు, రసమయి బాలకిషన్, సంజయ్ కుమా ర్, సుంకే రవి శంకర్, కోరుకంటి చందర్, జడ్పీ చైర్మన్ కనుమళ్ల విజయ, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్ రావు, కె సత్యనారాయణ గౌడ్, డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కార్పొరేషన్ల చైర్మన్లు సర్దార్ రవీందర్ సింగ్, దామోదర్ గుప్తా, బండ శ్రీనివాస్, అనిల్ కూర్మా చలం, కలెక్టర్ కర్ణన్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, చూడ చైర్మన్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణ రావు, కార్యదర్శి రూప్ సింగ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఓరుగంటి ఆనంద్ తో పాటు పార్టీ శ్రేణులు, ప్రభుత్వ, పోలీసు అధికారులు, అభిమా నులు, తదితరులు పాల్గొన్నారు.

