నిజాం పాలకుల పాలిట సింహ స్వప్నం కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి

నిజాం పాలకుల పాలిట సింహ స్వప్నం కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి

వర్ధంతి బహిరంగ సభలో…
తిమ్మాపూర్, జనవరి 3 (విశ్వం న్యూస్) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వ ర్యంలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట సేనాని, దివంగత మాజీ ఎంపీ, అమరజీవి కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి 44 వ వర్ధంతి బహిరంగ సభ ఘనంగా జరిగింది. ఈ సభకు ప్రజాగాయకుడు, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాల కిషన్ ముఖ్య అతిథిగా హాజరై తన ఆటా పాటలతో ప్రజలను ఉర్రూతలూగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నిజాం పాలకుల పాలిట సింహస్వ ప్నం కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి అని కొనియాడారు. నిజాం నిరంకుశ పదఘట్టనలు, వెట్టి చాకిరి బతు కులు, బాంచెన్‌ దొర నీ కాల్మొక్త దొర అంటూ తల దించుకుని బతికే కాలంలో మట్టి మనుషుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన అగ్నికణం బద్దం ఎల్లారెడ్డి గుర్తు చేశారు. తాడిత, పీడిత ప్రజలను ఏకం చేసి వ్యవసా య పని ముట్లను ఆయుధంగా మలిచి బానిసత్వం తిరుగుబాటు బావుటా ఏసిన ఎల్లారెడ్డి గారిది నా మానకొండూర్ నియోజకవర్గమైన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని గాలిపెల్లికి గ్రామం కావడం ఎంతో గర్వాంగా ఉందన్నారు. గాలిపెల్లిలో తన సొంత భూములను పేదలకు పంచడంతో పాటు సిరిసిల్ల ప్రాంతాల్లో దున్నేవాడిదే భూమి అంటూ ఉద్యమాన్ని రగిలించడమే కాకుండా నిజాయితీగా ఉంటూఅంతే నిబద్ధతతో పనిచేశని ఉద్యమ యోధుడని వివరించారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఎల్లారెడ్డి మద్రాసులో అరెస్ట్‌ అయి మూడు నెలల జైలుశిక్షను అనుభవించారని అన్నారని తెలిపారు. 1951లో జరిగిన తొలి ఎన్ని కల్లోనే పీడీఎఫ్‌ అభ్యర్థిగా కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బద్దం ఎల్లారెడ్డి విజయం సాధించి, ఒక్కసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బద్దం ఎల్లారెడ్డి తుదిశ్వాస విడిచేవరకు అట్టడు గువర్గాల మేలుకోరిన ప్రజానేత అని ఆయన సేవలను ఎమ్మె ల్యే డా.రసమయి కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్, సిపిఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి లతో పాటు బిఆర్ఎస్, సిపిఐ పార్టీల ముఖ్య నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, అభిమా నులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *