మృతుడి కుటుంబానికి పరామర్శ
మృతుడి కుటుంబానికి పరామర్శ
సర్వర్ చారిటబుల్ ఆర్థిక సహాయం
గోవిందరావు పేట, పిబ్రవరి 16 (విశ్వం న్యూస్) : మృతుడి కుటుంబానికి సాయం అందించిన ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ సహృదయాన్ని చాటుకున్నారు. గోవిందరావు పేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన దార్ల సాంబశివరావు ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న తస్లీమా గురువారం వెళ్ళి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, చిత్ర పటానికి పూలతో నివాళులర్పించారు. ఆయన మరణం బాధాకరమని, మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను తస్లీమా ఓదార్చారు. సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందించి సహృదయాన్ని చాటుకున్నారు. తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ సభ్యులు,గ్రామస్థులు ఉన్నారు.

