గర్భిణీ మహిళ మృతి కారణమైన వైద్యాధికారులపై చర్య తీసుకోవాలి
గర్భిణీ మహిళ మృతి కారణమైన వైద్యాధికారులపై చర్య తీసుకోవాలి
- బానోత్ వెంకన్న-అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు
వరంగల్ బ్యూరో, పిబ్రవరి 16 (విశ్వం న్యూస్) : ములుగు జిల్లాలో నిండు గర్భిణీ మహిళ సకాలంలో వైద్యం అందక మృతి చెందడంపై వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని గురువారం అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బానోత్ వెంకన్న ఆరోపించారు. ఈ సందర్భంగా బానోతు వెంకన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఆదివారం సాయంత్రం భూపాల్ పల్లి నుండి ములుగు జిల్లా ఏరియా హాస్పిటల్ కి ఊపిరితిత్తుల సమస్యతో 8 నెలల నిండు గర్భిణి నాగావత్ స్వాతి వైద్యం కొరకు రాగా ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ తో వైద్యం చేయకుండా కొంతమంది సిబ్బంది వ్యవహార శైలితో హన్మకొండ ప్రసూతి హాస్పిటల్ కు తరలించగా మార్గమధ్యంలో మృతి చెందడం జరిగింది. స్వాతి మరణం చాలా బాధాకరం. సరైన వైద్యం ములుగు హాస్పిటలో జరపకుండ అక్కడి నుండి బాధితరాలును హన్మకొండ తరలించాలనే దృక్పదం మాత్రమే స్పష్టంగా కనపడింది. ఈ విషయంపై విచారణ జరిపి వైద్య సిబ్బందిపై తగు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

