నవీన్ యాదవ్ విజయం సందర్భంగా కాంగ్రెస్ నేతల సంబరాలు

నార్సింగ్/శంషాబాద్, నవంబర్ 14 (విశ్వం న్యూస్):
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ నాయకులు ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నార్సింగ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కోటా వేణు గౌడ్, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ తలారి ప్రేమ్ కుమార్, బాల్రెడ్డి రాము యాదవ్, మహేష్ గౌడ్ తదితరులు విజేతకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

అదేవిధంగా, కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు పూలపల్లి కృష్ణారెడ్డి, శంషాబాద్ అధ్యక్షుడు శేఖర్ యాదవ్, నార్సింగ్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కోటా వేణుగౌడ్, డైరెక్టర్ తలారి ప్రేమ్ కుమార్, బాల్రెడ్డి రాము యాదవ్, కఎట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

నవీన్ యాదవ్ విజయం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని నాయకులు పేర్కొన్నారు.
