పసునూరు ఆదర్శ పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

పసునూరు ఆదర్శ పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

  • అంబేద్కర్ సిద్ధాంతాలు ప్రతి విద్యార్థికి మార్గదర్శకం: ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ వేముల బాలరాజు

నాగారం, నవంబర్ 26 (విశ్వం న్యూస్) : నాగారం మండల పరిధిలోని పసునూరు తెలంగాణ ఆదర్శ పాఠశాలలో బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ వేముల బాలరాజు మాట్లాడుతూ—ప్రపంచ దేశాల రాజ్యాంగాలలో భారత రాజ్యాంగం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుందని తెలిపారు.

భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాత్ర అపూర్వమని ఆయన అన్నారు. పేదలు, అణగారిన వర్గాల కోసం అనేక హక్కులను రాజ్యాంగంలో స్థాపించి భారత ప్రజాస్వామ్యానికి పునాది వేసిన మహానుభావుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. నేటి తరంలోని విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకొని మహనీయుల జీవిత చరిత్రలు చదవాలని సూచించారు.

కార్యక్రమంలో సోషల్ ఫోరం ఆధ్వర్యంలో వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ వంటి పోటీలను ఉపాధ్యాయులు నిర్వహించారు. సోషల్ ఉపాధ్యాయులు రవి, సాధన, మహేష్, వెంకన్న, లింగరాజు, సోమసుందర్, కృష్ణ, నాగరాజు, వీరన్న, అశోక్, మహేష్, లింగయ్య, శ్రావణ్, రాధా, విజయలక్ష్మి, హసీనా, వెంకటరమణతో పాటు విద్యార్థినీ–విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *