కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంటు చేయాలి

కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌
కార్మికులను పర్మినెంటు చేయాలి

  • సీఎం, సిఎస్, మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి

కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంటు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్, మార్చి 28 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రం లో అన్ని మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సోమవారం రోజు సిరిసిల్ల పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ కు సంఘం పక్షాన రిప్రజెంటేషన్ ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో కాంట్రాక్ట్ ఆపరేటర్ గా బిల్ కలెక్టర్, ఎలక్ట్రిషన్, టాక్టర్ డ్రైవర్, దినసరి ఉద్యోగులుగా విధి నిర్వహణ చేస్తున్నారు.

మున్సిపల్ శాఖలలో ఖాళీలను బట్టి ఈ యొక్క ఉద్యోగులను అదే శాఖలో ఖాళీలలో పర్మినెంట్ చేయాలి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు, మంత్రి కేటీఆర్, చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి మున్సిపాల్ స్పెషల్ డైరెక్టర్ అరవింద్ కుమార్ లకు సంఘాల పక్షాన విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో మున్సిపల్ పాలకవర్గంలో దాదాపు మున్సిపల్ కార్పొరేషన్ లో అన్ని చోట్ల అన్ని రకాల ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న అవుట్ సైడ్ కాంట్రాక్టు దినసరి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని వారందరినీ కూడా 010 పద్దు కింద నెలవారీ జీతాలు సబ్ ట్రెజరీ ద్వారా వచ్చినట్లు చర్యలు చేపట్టాలని, మున్సిపల్ శాఖలో ఈ కేటగిరిలో అవుట్ సైడ్ కాంట్రాక్టు దినసరి ఉద్యోగులుగా పనిచేస్తూ ఆ శాఖలోని కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా వారిని పర్మినెంట్ చేయడం లేదు వారిని పర్మనెంట్ చేసినట్లయితే వారి అర్హతలను బట్టి ఆ మున్సిపల్ శాఖలో వారందరిని ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాలకవర్గం సభ్యులు కూడా వారి అర్హతలను బట్టి ఎన్ని సంవత్సరాల నుండి మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నారు. అలాంటి ఉద్యోగులకు సంబంధించిన వివరాలను తీసుకొని పాలకవర్గం వారి యొక్క తీర్మానం చేసి పాలకవర్గం ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తేవడానికి పాలకవర్గం చైర్మన్ తో పాటు సభ్యులందరూ ఈ ఒక్క ఉద్యోగుల కొరకు కృషి చేయాలని ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అవుట్ సైడ్ కాంట్రాక్టు దినసరి ఉద్యోగులుగా పనిచేసిన ఉద్యోగులు అలాగనే ఇంటికి వెళ్లే పరిస్థితి వస్తుంది అలా కాకుండా వారందరిని వారి కేటగిరీలలో పనిచేస్తున్న వారి అందరిని పర్మినెంట్ ఉద్యోగులుగా చేయడానికి పాలకవర్గ చైర్మన్ తో పాటు అధికారులు కూడా సహకరించాలని మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *