కుక్కల దాడిలో బర్రె మృతి

వీణవంక, మార్చి 28 (విశ్వం న్యూస్) : వీణవంక మండలంలోని ఎల్బాక గ్రామానికి చెందిన చింతల శంకర్ రెడ్డి కి చెందిన బర్రెను కుక్కలు దాడి చేయడంతో మృతి చెందింది. సుమారు 20 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన చెందుతున్నారు.
తక్షణమే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని కుక్కలను పట్టుకోవాలని గ్రామ ప్రజలు కోరుచున్నారు. ఇటీవల పలు గ్రామాల్లో మనుషులపై కూడా దాడులు జరిగినా అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు గాని ఎవరు పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు.