కన్నీళ్లు నింపిన తెల్ల బంగారం

కన్నీళ్లు నింపిన తెల్ల బంగారం

పత్తికి కనీసం రూ. 15000 మద్దతు ధర ఇవ్వాలి
వీణవంక, మార్చి 15 (విశ్వం న్యూస్) : తమ ఇంటిని బంగారం గా మారుస్తుందనీ తెల్ల బంగారం పండించిన రైతులను కన్నీళ్ళే మిగిలాయి గతం లో ఎన్నడూ లేని విధంగా పత్తి ధర పడిపోవటంతో రైతులు పత్తిని ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు. పత్తి ధర పెరుగుతుందో లేదో అని అయోమయంలొ ఉన్నారు. కన్నీళ్లు నింపిన తెల్ల బంగారం అని వాపోతున్నారు. అప్పులు చేసి అడ్డగోలుగా విపరీతమైన క్రిమి సంహారక మందులు వాడి కలుపు కూలీలు, ఎరువులకు, ఇతర ఖర్చులకు ఎకరానికి సుమారు 40 నుంచి 50 వేల వరకు పెట్టుబడులు పెట్టీన కనీస పత్తి మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పత్తికి కనీస మద్దతు ధర 15000 రూపాయలుగా చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. హిమ్మత్ నగర్ గ్రామానికీ చెందిన యువ రైతు మోర్తల రఘువరన్ కౌలుకు తీసుకుని 4 ఎకరాలలో పత్తి సాగు చేసిన ఎకరానికి 40 వేల మీదనే పెట్టుబడి పెట్టి పత్తి ధర కోసం ఎదురు చూస్తున్నానీ, పెట్టుబడి కొసం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఈ ధరకు పత్తిని అమ్మితే ఎం మిగలదు అని మద్దతు ధర కొసం పడి గాపులు కాస్తున్నానీ ఈ అవేదన ఒక్క రఘువరన్ సమస్య కాదు పత్తి సాగు చేసిన ప్రతి రైతు ఆవేదన అని వాపోయారు. పత్తికి కనీసం మద్దతు ధర 15000 రూపాయలు చెల్లించాలని యువ రైతు మోర్తల రఘువరన్ కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *