గోవుల పునరుత్పత్తి, ఉచిత చికిత్స శిబిరం

తిమ్మాపూర్, జనవరి 6 (విశ్వం న్యూస్) : ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణాకేంద్రం కరీంనగర్ ఆధ్వర్యంలో శుక్రవారం తెలంగాణా యువ పశు వైద్యాధికారులకు “ పాడి పశువుల పునరుత్పత్తి నిర్వహణా నైపుణ్య మెళకువలు శిక్షణలో భాగంగా 15 జిల్లాలకు చెందిన 25 మంది పశు వైద్యులు, ప్రత్యేక గో బోధనా సిబ్బంది, శిక్షణా కేంద్రం అధికారి, సిబ్బంది, సంయుక్తంగా స్థానిక విజ్ఞాన కేంద్రం గోశా లలో ఉచిత పశువైద్య చికిత్సాశిబిరాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా గోశాల నిర్వహణా విషయాల గురించి చర్చించి, గోశాలలోని గోవులను పరిశీలించి, పరీక్షలు నిర్వహించారు. గోజాతి నిర్ధారణ, పునరు త్పత్తి సమస్యల నిర్ధారణ, చికిత్స నివారణా చర్యల తో పాటుగా ఆవు పాల విక్రయ విధానాలను, విలు పు పెంపొందింపు పద్ధతులను విపులీకరించారు. గోశాల నిర్వాహకులకు తగిన సూచనలు, సలహాలు చికిత్సా శిబిర నిర్వహణకు కావలసిన మౌలిక వస తులు, మందులను శిక్షణా కేంద్రం తరపున డా.ఎన్. లింగారెడ్డి సమకూర్చినారు. ఈ కార్యక్రమంలో డా. ఎన్. లింగారెడ్డి, ప్రత్యేక బోధనా నిపుణులు డా.జి. విజయకుమార్ శర్మ, డా. రాజిరెడ్డి, శిక్షణాకేంద్రం అధ్యాపకులు డా. ఎం. కోటేశ్వరరావు, డా. సి.హెచ్. సాయి చైతన్య, డా. దివ్య, గోశాల నిరాహక బృంద సభ్యులు పుల్లూరి రామారావు, కోమళ్ళ రాజేందర్ రెడ్డి,ఎలగందుల సత్యనారాయణ, యాలాల నర్సిం గo, తదితరులు పాల్గొన్నారు.
