జమ్మికుంట:కంటి వెలుగుశిబిరాన్ని
ఆకస్మిక తనిఖీ చేసిన డిప్యూటి
డి.ఎం.హెచ్.ఒ డాక్టర్ చందు

జమ్మికుంట , మే 24 ( విశ్వం న్యూస్ ): జమ్మికుంట పట్టణ పరిధిలోని కొత్తపల్లిలో జరుగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని హుజురాబాద్ డిప్యూటీ డి.ఎం.హెచ్.ఒ డాక్టర్ చందు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా డా: చందు మాట్లాడుతూ 26వ తేదీ వరకు శిబిరం కొనసాగుతుందని 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేసుకోవాలని, కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, అలాగే దగ్గరచూపు సమస్య ఉన్నవారికి అప్పటికప్పుడు అద్దాలు ఇవ్వడం జరుగుతుందని దూరం చూపు సమస్యలు ఉన్నవారికి ప్రీస్క్రిప్షన్ అద్దాలు నమోదు చేయడం జరుగుతుందని తెలియ జేశారు.
ఈ కార్యక్రమంలో సాజిద్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, పంజాల ప్రతాప్ గౌడ్ డిస్టిక్ హెల్త్ ఎడ్యుకేటర్, మరియు కంటి వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.