బోడుప్పల్ జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్లో డిజిటల్ క్లాసులు ప్రారంభం

బోడుప్పల్ జెడ్ పి హెచ్ ఎస్ హై
స్కూల్లో డిజిటల్ క్లాసులు ప్రారంభం

  • ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, స్టాఫ్ అశోక్ కుమార్..
  • మేయర్ సామల బుచ్చిరెడ్డి, మాజీ జెడ్పిటిసి మంద సంజీవరెడ్డి హాజరు

బోడుప్పల్, జూన్ 20 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ నగర పాలక సంస్థలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం పురస్కరించుకొని జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ లో ప్రభుత్వం ద్వార మంజూరైన 3 డిజిటల్ టీవిలను మేయర్ సామల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ, బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ రెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మా పాఠశాల అభివృద్ధిలో కార్పొరేషన్ సహకారం ఎనలేనిదని, ప్రతి సమస్యలో భాగస్వామ్యం పంచుకొని ఎటువంటి సమస్య లేకుండా చూస్తున్నారని మేయర్ సామల బుచ్చిరెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మా విద్యార్థిని విద్యార్థుల చదువు కోసం మాకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ ముగ్గురు విద్య వాలంటరీ టీచర్లకు జీతాలు ఇచ్చిన మాజీ జెడ్పిటిసి సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

మేయర్ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ పాఠశాల పారిశుద్యం నుండి మొదలు వైద్యం, కరెంటు ఎటువంటి సమస్యలున్న ముందుండి సహకారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుండి రూ. 56 లక్షల పనుల అభివృద్ధికి నిధులు మన ఊరు మన బడి కింద మంజూరు అయ్యాయని,టెక్నీప్ ఎఫ్ ఎమ్ సి వారు రూ. 96 లక్షలతో 4 అదనపు గదులు, నీటి కుళాయి, బాత్రూం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల స్టాఫ్ అశోక్ కుమార్, టెక్నీప్ ఎఫ్ ఎం సి మేనేజర్ సుజాత, స్టాప్ విద్యార్థినీ విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *