దిగొచ్చిన దిల్ రాజు

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విశ్వం న్యూస్) : దిల్ రాజు కొంతసేపటి క్రితం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. “ఏ రకంగానైనా ఈ సినిమాను జనమంతా చూడాలనేది మా కోరిక. థియేటర్ ద్వారా .. ఓటీటీ ద్వారా .. టీవీల ద్వారా ఈ సినిమా జనంలోకి వెళ్లాలనే అనుకున్నాము. ఇప్పుడు నాలుగో ఆప్షన్ కూడా వచ్చేసింది. ఊరూరా తెరలు కట్టేసి ఈ సినిమాను వేసుకుని చూస్తారని మేము ఊహించలేదు. ఈ సినిమాను ఎక్కడ ప్రదర్శిస్తున్నా ఆపేసే ఉద్దేశం లేదు .. ఓపెన్ గా చెబుతున్నాను ఎక్కడా ఆగదు” అన్నారు.
ఈ సినిమాకు మాకు వస్తున్న పేరు చాలని.. డబ్బు అవసరం లేదని పేర్కొన్నారు. పైగా తమ సినిమా ద్వారా సమాజంలో మార్పు వస్తుందంటే అంతకు మించిన ఆనందం ఏముంటుందని అన్నారు. ఇలాంటి ఆనందాన్ని డబ్బుతో కొనలేమని స్పష్టం చేశారు. అయితే సినిమా హక్కులను ఓటీటీకి ఇచ్చినందు వల్ల కొన్ని చట్టపరమైన సమస్యలు ఉంటాయని.. వారి నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే తమ లీగల్ టీమ్ ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు. అంతే తప్ప సినిమా ప్రదర్శనలు ఆపాలన్న ఉద్దేశం తమకు లేదని క్లియర్‌గా వెల్లడించారు దిల్ రాజు.