ఘనంగా భక్తుల జయజయ
ధ్వనుల మధ్య దీపస్తంభ ప్రతిష్ట

హైదరాబాద్, డిసెంబర్ 26 (విశ్వం న్యూస్) : శివ ఆలయ స్వామి దేవాలయం, శాస్త్రి నగర్, నందు గల నాగదేవతల, నందీశ్వర, పునః ప్రతిష్ట మరియు నూతన దీపస్తంభ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ చింతపల్లి వంశీ మోహన్ రెడ్డి DSP, శ్రీమతి చింతపల్లి శోభా రెడ్డి, గూడూరి శ్రీధర్ రెడ్డి, గూడూరి కళ్యాణి రెడ్డి వారి సౌజన్యంతో జరిపారు.

ప్రధాన ఉత్సవాల్లో పాల్గొన్న “డా. గూడూరి చెన్నారెడ్డి, IPC స్టేట్ ప్రెసిడెంట్, మరియు జి. విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొని, అక్కడి స్థానికుల ఆప్యాయత మరియు అనురాగాలకు ముగ్ధులై, ‘ఇది నా సొంత ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తోంది’ అని అన్నారు. ఈ బస్తి తొలి తరాల వారి వెంబడి కలిసి పనిచేసి, అదే గుడికి ఉడతా భక్తిగా సహాయం చేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. అలాగే, తాను నాటి మూడవ తరం తరపున సేవలు అందించడం మరియు నా మూడో తరం సంతానం కూడా ఈ గుడికి సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని కొనియాడారు.”

గుడి పునరుద్ధరణలో భాగంగా, హిందూ ధర్మం, జాతి అభివృద్ధి, సమగ్రత మరియు ఐక్యత కోసం గుడులను కాపాడుకోవాలన్న అంగీకారాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దాతలు తమ వంతు సేవ చేయాలని పిలుపునిచ్చారు.

ఈ ఉత్సవానికి స్థానిక బస్తి పెద్దలు, కంజల్ రా సదాశివ యాదవ్ (మాజీ కార్పొరేటర్), సత్యనారాయణ గౌడ్, దుర్గారాజ్, మల్లేష్, దీపక్, రమేష్, శ్రీనివాస్, జి. లేఖ రాజ్ రెడ్డి, జి. వన్ రాజ్ రెడ్డి, డి రవిగౌడ్, చింతల బాల సూర్య, రమాదేవి, నర్సమ్మ, మంగ తదితర భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమం చివరగా, అన్న ప్రసాదం అందించి, దేవాలయ పూజారుల ఆధ్వర్యంలో భక్తుల జయజయ ధ్వనుల మధ్య దీపస్తంభ ప్రతిష్టతో ముగించబడింది.