పీర్జాదిగూడ దశాబ్ది ఉత్సవాలలో జాతీయ జెండాకు అవమానం

పీర్జాదిగూడ దశాబ్ది ఉత్సవాలలో
జాతీయ జెండాకు అవమానం

  • మేడిపల్లి పిఎస్ లో దరఖాస్తు చేసిన కాంగ్రెస్ పార్టీ బృందం
  • కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి హాజరు

పీర్జాదిగూడ, జూన్ 12 (విశ్వం న్యూస్) : పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఏవి ఇన్ఫో ప్రైడ్ గ్రౌండ్స్ లో సోమవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంత్రి మల్లారెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, పాలకవర్గం ఆధ్వర్యంలో జరిగిన 2కే రన్ కార్యక్రమంలో జాతీయ జెండాను అవమానపరిచే విధంగా మున్సిపాలిటీ చెత్త వాహనంలో జాతీయ జెండాలను తీసుకెళ్లడం జరిగింది.

భారతదేశ పౌరులై ఉండి..ఒకరేమో ఒక పార్టీకి చెందిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మరొకరు మున్సిపల్ కార్పోరేషన్ ( మేయర్ ) కు ప్రథమ పౌరుడై ( జక్క వెంకట్ రెడ్డి ) ఉండి జాతీయ జండాను అగౌర పరచడం సిగ్గు చేటు. ఈ విషయంలో పీర్జాది గూడ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంగేటి ప్రభాకర్ రెడ్డి, రమేష్, మోహన్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పంగ రాజు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *