రహదారుల నిర్మాణం,పురోగతి పై డా.రసమయి సమీక్షా సమావేశం

తిమ్మాపూర్, జనవరి 13 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని అన్నారం, తదితర ప్రధాన రహదారుల పనుల పురోగతిపై శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొం డూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ ఆధ్వ ర్యంలో ఎలక్ట్రిసిటీ, రహదారులు భవనముల శాఖ, మిషన్ భగీరథ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. రసమయి మాట్లాడుతూ… రోడ్డు, రహదారుల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి, ప్రజల ఇబ్బందు లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో కరీంనగర్ సుడా చైర్మెన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీ.వి.రామకృష్ణారావు, జడ్పిటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మానకొండూర్ సర్పంచ్ రొడ్డ పృద్విరాజ్, ఉప సర్పంచ్ నెల్లి మురళి లతో పాటు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.