గుంపుల బ్రిడ్జి పై నుండి సిమెంట్
మిక్సర్ లారి క్రింద పడి డ్రైవర్ మృతి

జమ్మికుంట/ గుంపుల, మే 26 (విశ్వం న్యూస్): జమ్మికుంట మండలం శంబునిపల్లీ గ్రామం మరియు పెద్దపల్లి జిల్లా గుంపుల గ్రామ సరిహద్దు గల మానేరు బ్రిడ్జి పై నుండి ప్రమాదవశాత్తు తప్పి సిమెంట్ మిక్సర్ లారి మానేర్ వాగులో క్రింద పడి మధ్యప్రదేశ్ కు చెందిన సిమెంట్ మిక్సర్ లారి డ్రైవర్ (30) లారీలోనే చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు.
లారి వాహనం అదుపు తప్పి బ్రిడ్జి పై నుండి క్రింద పడి పోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బ్రిడ్జి సైడ్ వాల్ దెబ్బతింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.