జర్నలిస్టులపై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

టియుడబ్ల్యూజె సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కోలా నాగేశ్వరరావు.
జర్నలిస్టుల సమస్యలను సీఎం కేసీఆర్ కి వివరిస్తా.
జనవరి 6న హుజూర్ నగర్ మంత్రి కేటీఆర్ పర్యటనలో జర్నలిస్టుల సమస్యలపై మాట్లాడదాం.
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.
హుజూర్ నగర్, డిసెంబర్ 31 (విశ్వం న్యూస్) : సూర్యాపేట జిల్లాలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టియుడబ్ల్యూజే ఐజేయు యూనియన్ జిల్లా అధ్యక్షులు కోలా నాగేశ్వరరావు కోరారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో టియుడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో జిల్లాలో జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్ కు వివరిస్తానని అన్నారు. అదేవిధంగా జనవరి 6న హుజూర్నగర్ పర్యటనకు వస్తున్న మంత్రివర్యులు కేటీఆర్ తో జర్నలిస్టుల సమస్యలు మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. ప్రైవేటు కార్పోరేట్ వైద్యశాలలో హెల్త్ కార్డులు సక్రమంగా అమలయేల చర్యలు తీసుకుంటామని అన్నారు. జర్నలిస్టులకు అర్హులైన అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇల్లు ఇళ్ల స్థలాలు మంజూరి కోసం సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చినారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకంగా ఉన్నదని వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వాల కన్నా మిన్నగా జర్నలిస్టులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని వెల్లడించారు. ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన వారిలో టియుడబ్ల్యూజే ఐజేయు యూనియన్ జిల్లా కార్యదర్శి టివిఎల్, ఆర్గనైజే సెక్రటరీ బసవోజు శ్రీనివాస చారి, దాడుల నిరోధక కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ జానీ పాషా, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు కితారామనాథం, ప్రెస్ క్లబ్ జిల్లా అధికార ప్రతినిధి ఆర్ పి గౌడు, దాడుల నియంత్రణ కమిటీ జిల్లా అధికార ప్రతినిధి పెందుర్తి భాస్కర్, యూనియన్ అధికార ప్రతినిధి పిల్లలమర్రి శ్రీనివాసు, దాడులను నియంత్రణ కమిటీ జిల్లా కార్యదర్శి దేవరం రాంరెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి దేవరం వెంకటరెడ్డి, దాడులు నిరోధక కమిటీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దేనంకొండ శేషం రాజు, యూనియన్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ కొమరాజు అంజయ్య, దాడులు నిరోధక కమిటీ జిల్లా అధికార ప్రతినిధి చిట్టిపోతుల రమేష్, ప్రెస్ క్లబ్ జిల్లా కార్యదర్శి ఇట్టి మల్ల రామకృష్ణ పాల్గొన్నారు.