మాచనపల్లిలో కంటి వెలుగు

మాచనపల్లిలో కంటి వెలుగు

ప్రారబించిన సర్పంచ్ బెజ్జం కల్పన రెడ్డి
జమ్మికుంట, ఏప్రిల్ 19 ( విశ్వం న్యూస్ ) : జమ్మికుంట మండలంలోని మాచనపల్లి గ్రామంలో ఈరోజు
(బుధవారం) న కంటి వెలుగు శిబిరాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి బెజ్జం కల్పన రెడ్డి గారు, ఈ సందర్భంగా వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సనజవేరియా మాట్లాడుతూ ఈరోజు నుండి మే నెల 5వ తేదీ వరకు కంటి వెలుగు శిబిరం కొనసాగుతుందని 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పోల్సాని రాజేశ్వరరావు, క్యాంపు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక, ఉపసర్పంచ్ వేల్పుల శ్రీకాంత్, సూపర్వైజర్ స్వరూప, అమరేందర్ అప్రోమెట్రిస్ట్, పవన్ డాటా ఎంట్రీ ఆపరేటర్, ఆరోగ్య శాఖ సిబ్బంది సావిత్రి, రజిత, నరేందర్ మరియు ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *