వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్ జమ్మికుంట వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్
జమ్మికుంట వారి ఆధ్వర్యంలో
అన్నదాన కార్యక్రమం

జమ్మికుంట, సెప్టెంబర్ 7 (విశ్వం న్యూస్) : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రసేన్ గుప్త జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా జమ్మికుంట స్థానిక శివాలయంలో ప్రతినిత్యం అన్నపూర్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరిగే పేదలకు అన్నదానం కార్యక్రమంలో వాసవి క్లబ్ జమ్మికుంట వాసవి వనిత క్లబ్ జమ్మికుంట వారి సౌజన్యంతో అన్నదానం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి రాజా భాస్కర్, చార్టెడ్ ప్రెసిడెంట్ ఆకినపల్లి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు అయిత సుధాకర్, సుద్దాల శ్రీనివాస్, అధ్యక్షుడు రావికంటి నీలకంఠం, ప్రధాన కార్యదర్శి అయితు రమేష్, కోశాధికారి జీవి సతీష్, కార్యవర్గ సభ్యులు, వాసవి వనిత క్లబ్ జోన్ చైర్ పర్సన్ అయితా రమాదేవి, అధ్యక్షురాలు మద్ది లావణ్య, ప్రధాన కార్యదర్శి గుండా సుకిత, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *