గురువులను సత్కరించిన పూర్వ విద్యార్ధులు

కాజీపేట:గురువులకు పూర్వ
విద్యార్థులు ఘనసన్మానం

కాజీపేట, (విశ్వం న్యూస్) : 1984-85 టెన్త్ క్లాస్ పూర్వ విద్యార్థులు తమకు పాఠాలను బోధించిన గురువులను గురువారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. టీచర్స్ డే, పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనంను పురస్కరించుకుని ప్రాథమిక స్థాయిలో పాఠాలను బోధించిన గోపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డి సార్లను సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

అనంతరం సన్మాన గ్రహితలైన ఉపాధ్యాయులు మాట్లాడుతూ..38 ఏళ్ళ క్రితం విద్యార్థులు తమను సత్కరించి గురుభక్తిని చాటుకున్న వారిని అభినందించడంతో పాటు మరోసారి ఆశీస్సులు అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎన్. సంపత్, టి. మనోహర్, కోటేశ్వర్, పెరుమాండ్ల సాంబమూర్తి, రేవూరి మురళీధర్ రెడ్డి, జూలూరి రాజు, ఎమ్డీ.రఫీ, ఏ.కుమారస్వామి, జింక సదానందం, జి.రవీందర్, ఎం.శ్రీనివాస్, డి.శ్రీనివాసరావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *