సీకేఎం కాలేజీలో ఘనంగా పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

సీకేఎం కాలేజీలో ఘనంగా పూర్వ
విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

సి.ఎం కాలేజీ పూర్వ విద్యార్థి, బీసీటీయు రాష్ట్ర అసోసియేట్ అద్యక్షుడు పెరుమండ్ల సాంబమూర్తిని సన్మానిస్తున్న గురువులు

వరంగల్, ఏప్రిల్ 17 (విశ్వం న్యూస్) : వరంగల్ నగరంలోని ప్రముఖ విద్యా సంస్థ అయిన సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం ఘనంగా జరిగింది. 1990 నుంచి 1993 వరకు బి ఎ డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత కలుసుకొని ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు.

ఆ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీనియర్ అధ్యాపకులు సుదర్శన్ రెడ్డి, గౌరవ అతిథులుగా సీనియర్ ఆధ్యాపకులు బి. వెంకటేశ్వరరావు, మోహన్ రావు, సాంబయ్య, ఫిజికల్ డైరెక్టర్ మోహన్ రావు పాల్గొని పూర్వ విద్యార్థులను మరో మారు ఆశీర్వదించారు. అంతకుముందు పూర్వ విద్యార్థులందరూ గురువులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరికీ మెమెంటోలను ప్రధానం చేశారు.

అంతకుముందు ఈ సమ్మేళన కార్యక్రమం విజయవంతం కావడానికి నేతృత్వం వహించిన పూర్వ విద్యార్థి, ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్న కె.నాగయ్యను, కోర్ కమిటీ సభ్యులైన పెరుమాండ్ల సాంబమూర్తి, ఆర్. అశోక్, సిహెచ్. శ్రీధర్, ఎన్.సదానందం, జి అశోక్, మైటీ సాగర్, మేధా చిరంజీవి, కే రవి, ఎంపీడీవో బానోతు జయరాంలను గురువులు శాలువాలు, మెమెంటోలతో సన్మానించి అభినందించారు. 30 ఏళ్ళ తర్వాత కలుసుకోవడంతో పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న కళాశాలలో, తరగతి గదుల్లో కలియ తిరుగుతూ సందడి చేస్తూ గత రోజులను గుర్తు చేసుకుంటూ తన్మయత్వానికి గురయ్యారు.

సీకేఎం కాలేజీ పూర్వ విద్యార్థి, ప్రస్తుత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె. నాగయ్యను సన్మానిస్తున్న గురువులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *