నా డబ్బు నాకు ఇచ్చేయండి, ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి డిమాండ్ (video)
నా డబ్బు నాకు ఇచ్చేయండి…
ఓడిన అభ్యర్థి డిమాండ్

మహబూబాబాద్, డిసెంబర్ 13 (విశ్వం న్యూస్) : తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు టపాసులు కాల్చుతూ, సంబరాలు చేసుకుంటుండగా… ఓడినవారు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. కొందరు ఓటమిని జీర్ణించుకోలేక వింత డిమాండ్లతో ప్రజల ముందుకు వస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాలోని సోమ్లా తండాలో ఈ తరహా ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన భూక్యా కౌసల్య కేవలం 27 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ఆమె, డబ్బులు ఇచ్చినా ఓటు వేయలేదంటూ ఓటర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేశారా లేదా అంటూ ప్రమాణం చేయాలని డిమాండ్ చేస్తూ, లేదంటే ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇలాంటి సంఘటనలు మరికొన్ని ప్రాంతాల్లోనూ జరుగుతున్నట్లు సమాచారం.
