నగర కాంగ్రెస్ అధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

నగర కాంగ్రెస్ అధ్వర్యంలో ఘనంగా
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

కరీంనగర్ బ్యూరో, జూన్ 19 (విశ్వం న్యూస్) : నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాచౌక్ వద్ద రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల ఆదరణ పొందడమే గాకుండా ప్రజాసమస్యలపై పూర్తిగా అవగాహనతో ఉన్నారని భవిష్యత్తులో ప్రజా సంక్షేమం కోసం ప్రధాన మంత్రి కావలసిన అవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే జన్మదిన వేడుకలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి హోదాలో జరుపుకోవాలని నగర కాంగ్రెస్ ఆకాంక్షిస్తుందని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ కు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

ఖార్ఖనగడ్డ వృద్ధాశ్రమంలో దండి రవీందర్,మెరాజ్ ఆధ్వర్యంలో పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు.ఖరీముల్లాషా దర్గా వద్ద జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు తాజ్, నగర మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అఖిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన జరిపారు. హౌసింగ్ బోర్డులోని వృద్ధాశ్రమంలో నెల్లి నరేష్, లయక్ ఆధ్వర్యంలో పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో అంజన్ కుమార్, శ్రవణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, చర్ల పద్మ,బోనాల శ్రీనివాస్, గడ్డం విలాస్ రెడ్డి, షబానా మహమ్మద్, పోరండ్ల రమేష్, ఊరడి లత, మెతుకు కాంతయ్య, ఎండి చాంద్, షేక్ షేహెన్ష, ఎజ్రా దేవ్, కంకణాల అనిల్ కుమార్, ఎగ్గడి శారద, ముక్క భాస్కర్, దన్న సింగ్, సలిమొద్దిన్, అష్రాఫ్, బొబ్బిలి విక్టర్, నదిమ్, అన్న జ్యోతి, ఎజ్రా దేవ్, ముల్కల కవిత, హనీఫ్, ఆంజనేయులు, సాయిరాం, ముల్కల యోనా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *