ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

విశ్వం న్యూస్/హైదరాబాద్, సెప్టెంబర్ 4 : మంచిరేవుల శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి, భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు పలువురు ప్రముఖ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బండ్లగూడ 123వ డివిజన్ అధ్యక్షుడు పులాంపల్లి కృష్ణారెడ్డి, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వేణు గౌడ్, డైరెక్టర్ తలారి ప్రేమ్ కుమార్, మంచిర్యాల మాజీ సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, లక్ష్మణ్, శ్రీనివాస్, రాము యాదవ్, మాజీ ఎంపీటీసీ కుమార్ యాదవ్, రాజారామ్ తదితరులు హాజరయ్యారు.

అలాగే వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్ పొన్న రమేష్, వైస్ చైర్మన్ జీడి క్రాంతి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *