ఆదివారం మంత్రివర్గ విస్తరణకు అవకాశం : మంత్రులుగా ఎవరికి ఛాన్స్ ?

(విశ్వం న్యూస్)హైదరాబాద్, సెప్టెంబర్ 5: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై మరోసారి చర్చ జోరందుకుంది. ఆదివారం మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. విస్తరణలో భాగంగా నలుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశమున్నట్లు సమాచారం.
సంభావ్య జాబితాలో మహేష్ కుమార్ గౌడ్ (బీసీ), గడ్డం ప్రసాద్ కుమార్ (ఎస్సీ), రాజగోపాల్ రెడ్డి (ఓసీ), విజయశాంతి (బీసీ) పేర్లు వినిపిస్తున్నాయి. కాగా, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో క్యాబినెట్ కేటాయింపులకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
మొత్తం 15వ నంబర్ క్యాబినెట్ కేటాయింపుపై కూడా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గ విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.