మిత్రునికి పదవి
విరమణ శుభాకాంక్షలు

- సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ గయాసుద్దీన్ ఘనంగా పదవి విరమణ
హుజురాబాద్, జనవరి 31 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన సయ్యద్ గయాసుద్దీన్ శుక్రవారం తన పదవి విరమణ చేసుకున్నారు. ఈ సందర్భంగా, మురాద్ నగర్‌కు చెందిన ఆయన చిన్ననాటి మిత్రుడు టిసిటిఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
27 సంవత్సరాల పాటు ప్రజా పరిపాలనలో నిబద్ధతతో సేవలు అందించిన గయాసుద్దీన్ మొదట అంబాల గ్రామ హైస్కూల్లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, అనంతరం కరీంనగర్ జిల్లా పరిషత్తు, హుజురాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో విశేష సేవలందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్, నాన్-గజిటెడ్ ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, మహమ్మద్ అప్సర్, మహమ్మద్ సలీం, మహమ్మద్ జానీ పాషా, మహమ్మద్ అబ్దుల్, అజీజ్ మీర్జా, అఫ్జల్ బేక్, మహమ్మద్ ఖాజా పాషా, మహమ్మద్ అహ్మద్ ఖాన్, సయ్యద్ ఫయాజుద్దీన్, ఎండి అమీన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
సయ్యద్ గయాసుద్దీన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకొని, తోటి పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సహాయ సహకారాలు అందించాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆకాంక్షించారు.