క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి –తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తల ఆగ్రహం

హైదరాబాద్, జూలై 12 (విశ్వం న్యూస్) : మేడిపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తీన్మార్ మల్లన్నకి చెందిన క్యూ న్యూస్ కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడికి దిగారు. మల్లన్న వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వారు, కార్యాలయం ఎదుట నిరసనలు తెలుపుతూ నినాదాలు చేశారు. అనంతరం అడ్డగోలుగా విచ్చిన్నం చేసిన ఘటన పోలీసుల అరాకతలో కలకలం రేపింది.

ఈ ఘటన నేపథ్యంలో మేడిపల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మల్లన్న అనుచరులు కూడా కార్యాలయం వద్దకు చేరుకోవడంతో పరస్పర మాటల యుద్ధం జరిగింది. అప్రమత్తమైన పోలీసులు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఈ దాడి రాజకీయ దుమారానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. మల్లన్న వ్యాఖ్యలేనా కారణం? లేక ఇది ముందుగానే రచించబడిన కుట్రా? అన్నదానిపై చర్చలు ముదురుతున్నాయి. మరోవైపు, మీడియా స్వేచ్ఛపై ఇది దాడిగా అభిప్రాయపడుతున్నారు మల్లన్న అనుచరులు.

ఈ ఘటనపై అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి మిక్స్డ్ స్పందనలు వస్తున్నాయి. అధికార పార్టీ ప్రతినిధులు మల్లన్న వ్యాఖ్యలను ఖండించినప్పటికీ, దాడి చర్యను సమర్థించలేమని అంటున్నారు.

తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *