హరీష్ రావు: మీరా ఉద్యోగుల గురించి మాట్లాడేది..?

  • రైతు బంధు డబ్బులు ఆపి ఏసీ రూములో కూర్చునే ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లించింది అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
  • మాజీమంత్రి హరీష్ రావు ప్రభుత్వ ఉద్యోగులకు రైతుల మధ్య చిచ్చు పెట్టకండి అన్నా తమ్ముల్లాగా కలిసి మెలిసి ఉంటున్న మమ్మల్ని విడదీయకండి మీ స్వార్థ రాజకీయ కొరకు
  • తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి

హైదరాబాద్, మార్చి 9 (విశ్వం న్యూస్) : ఉద్యోగుల ఉద్యమాల పునాది పైన మీరు పది సంవత్సరాలు అధికారాన్ని చెలయించారు. అధికారంలోకి వచ్చాక 10 ఏళ్ల పాటు ఉద్యోగుల సంఘాలను అడ్రస్సు లేనట్టు చేశారు. ఉద్యోగులకు రావలసిన వేతనాలను కూడా 10 తేదీ లేక 22వ తారీకు రోజు జీతాలు రాకుండా, ఇవ్వకుండా ఆత్మహత్యలకు కారణమయ్యారు.

అలాంటి మీరు అధికారం పోగానే ఉద్యోగులపైన, వారి వేతనాలపైన, నోరు పారేసుకోవటం మంచిది కాదు మరో మారు ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి వాక్యాలు చేస్తే ఊరుకోం అని బిఆర్ఎస్ నేతలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ హెచ్చరించారు.

10 ఏళ్ల పాటు హరీష్ రావు ఏసి రూమ్లలో, ఏసీ వాహనాలలో తిరిగిన వ్యక్తి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల మీద వేలు ఎత్తి మాట్లాడటం సిగ్గుచేటు ఇంకోసారి గనుక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల మీద ఏదైనా గనుక మాట్లాడినట్టయితే ఇంటిని ముట్టడిస్తాం ఖబర్దార్ ఇకముందు హరీష్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్రంలో 317 జీవో తీసుకుని వచ్చి ఎంతోమంది ఉద్యోగుల కుటుంబాలను ఒకరికి ఒకరు కల్వనట్టుగా చేసింది హరీష్ రావు మీరు కదా 317 జీవో ద్వారా బదిలీ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయులు రోడ్ల మీద వచ్చి నిరాహార దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, చిన్న పిల్లలను తీసుకొని ధర్నాలో కూర్చున్న మహిళలను కూడా లాగి కొట్టించిన ప్రభుత్వం మీది కాదా.

ఒక్క నెల సరియైన సమయంలో ఒకటో తారీకు జీతం చెల్లించారా, ప్రభుత్వ ఉద్యోగులు పెట్టుకున్నా జిపిఎఫ్, మెడికల్ బిల్, సరెండర్ లీవ్ లు మంజూరి కాకుండా చేసిన ఘనత మీది కాదా హరీష్ రావు.

పది సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులను ఫుట్బాల్, వాలీబాల్ ఆడుకున్న ప్రభుత్వం మీది ప్రభుత్వ ఉద్యోగులకు మంజూరు చేసిన హెల్త్ కార్డు కూడా ఏ ప్రభుత్వ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పటల్లో నడవలేదు అలాంటి పరిస్థితులు ఆస్తులు పాస్తులు అమ్ముకొని బిల్లులు చెల్లించుకున్న ప్రభుత్వ ఉద్యోగులే కదా ఏదైనా సమస్య చెప్పుకుందాం అని ముఖ్యమంత్రిని, మంత్రులను గాని చెప్పుకుందామని వస్తే కలవని వ్యక్తులు మీరు.

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై వారి యొక్క సమస్యలు గత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు దృష్టికి తీసుకొని వెళ్దామని అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు కలవని లాంటి వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ కదా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రభుత్వం కొనసాగుతున్న ఎవరైనా ఎప్పుడైనా ఎవరికైనా కలవవచ్చు సమస్యలు చెప్పిన కూడా పరిష్కారం అవుతుంది. అలాంటి ప్రభుత్వం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది ప్రతి ఒక్కరూ సంతోషపడుతున్నారు ఇది వాస్తవం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *