హరితహారం ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

హరితహారం ప్రారంభించిన
ముఖ్యమంత్రి కేసీఆర్‌

రంగారెడ్డి, జూన్ 19 (విశ్వం న్యూస్) : తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు హరితోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులో మొక్కను నాటి తొమ్మిదో విడత హరితహారానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీ రంజిత్‌ రెడ్డి, రాచకొండ సీపీ చౌహాన్‌, ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

అంతకుముందు సఫారీ వాహనంలో పార్కులో కలియతిరిగిన సీఎం కేసీఆర్‌.. ఫొటో ఎగ్జిబిషన్‌ను, అటవీ అధికారుల సామాగ్రిని తిలకించారు. అనంతరం బీటీఆర్‌ క్రికెట్‌ స్టేడియంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడనున్నారు. తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 19.29 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.

తాను నమ్మిన ప్రకృతి పునరుజ్జీవనాన్ని తెలంగాణ సమాజంలోని ప్రతి ఒక్కరి మదికి ఎకేలా చేయటంలో సీఎం కేసీఆర్‌ సక్సెస్‌ అయ్యారు. ఆయన కృషి, పట్టుదల ఫలితాలే దశాబ్ది తెలంగాణలో మన కండ్ల ముందు కనిపిస్తున్న సతతం హరితం.. తెలంగాణం. ఎమిదేండ్లలో నాటిన 273.33 కోట్ల మొక్కలు చెట్లుగా మారి ఆక్సిజన్‌తోపాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరిత తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షిగా నిలిచింది. ఇందుకు ప్రభుత్వం రూ.10,822 కోట్లు ఖర్చుచేసింది.

  • ఆటవి రక్షణలో తన విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన FRO శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మి కి, డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగ నియామక ఉత్తర్వులు వేదిక మీద అందించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు.
  • పెద్ద దిక్కును కోల్పోయిన మాకు కుటుంబ పెద్దగా, తండ్రి లాగా సీఎం కేసీఆర్ అండగా నిచిచారు. మమ్మల్ని ఆదుకున్నారు. ఇప్పటికే ఇంటి స్థలం, ఆర్థిక సహాయం చేశారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారికి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు – రేంజర్ శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *