ఘనంగా రాహుల్ గాంధీ 53వ జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ
53వ జన్మదిన వేడుకలు

ఇల్లంతకుంట, జూన్ 19 (విశ్వం న్యూస్) : భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని కొత్తపెళ్లి స్పందన అనాధ ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు స్వీట్లు కోడిగుడ్లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఇంగిలే రామారావు గారు మాట్లాడుతూ భారతదేశాన్ని ఐక్యంగా ఉంచడానికి నిబద్ధత పనిచేస్తున్న కృషివలుడు ప్రజల కోసం అన్ని త్యాగం చేసిన మహర్షి కోట్ల మందితో కోట్ల అడుగులు వేసిన బాటసారి భారతదేశ ఆశాజ్యోతి యువతకు స్ఫూర్తి నియంత పాలనలో నలిగిపోతున్న దేశ ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడు, హాత్ సే హాత్ జోడో యాత్ర ద్వారా ప్రజల్ని ఏకతాటిపైకి నడిపించేటువంటి దీరుడు అని కొనియాడడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ బండి మల్లేష్, ఎర్రం సతీష్ రెడ్డి, సలీం, గోడిశాల పరమేష్, రంజిత్ రెడ్డి, ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి, భోగం సాయి, పైడిపల్లి దేవేందర్, గుండ్ల వెంకన్న, ముద్దమల్ల రవి, రాకేష్, నవదీప్ రెడ్డి, NSUI మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *