చారిత్రాత్మక ఆలయం..ఫాతిమా మాత దేవాలయం

చారిత్రాత్మక ఆలయం..
ఫాతిమా మాత దేవాలయం

  • నేటి నుంచి ఫాతిమా మాత ఉత్సవాలు ప్రారంభం
  • విద్యుత్ దీపాలతో విరాజిల్లుతున్న దేవాలయం
  • *భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు : వరంగల్ బిషప్ ఉడుముల బాల

కాజీపేట, మార్చి 10 (విశ్వం న్యూస్): వరంగల్ నగరంలోని కాజీపేట పట్టణ పరిధిలో గల ఫాతిమా కేథడ్రల్ చర్చి చారిత్రాత్మక ఆలయంగా పేరొందింది. ఫాతిమా మాత కొలువు తీరడంతో కాజీపేట పట్టణంలోని ఈ ప్రాంతానికి ఫాతిమా నగర్ అని పేరు వచ్చింది. *ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఫాతిమా మాత ఉత్సవాలకు వరంగల్ జిల్లాతో ఇతర జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలిరావడం విశేషం* ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈనెల 11, 12, 13వ తేదీల్లో ఫాతిమా మాత జాతర నిర్వహించనున్నారు జాతర ఏర్పాట్లలో భాగంగా అలంకరించిన విద్యుద్దీపాలతో ఫాతిమా మాత చర్చి విరాజిల్లుతుంది *ఈ మేరకు కాజీపేట మీడియా పాయింట్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ బిషప్ ఉడుముల బాల ఫాతిమా మాత ఉత్సవాల వివరాలను వెల్లడించారు. *ఈ ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు* అంతకు ముందు ఫాతిమా మాత ఉత్సవాల కరపత్రాలను, పోస్టర్లను విడుదల చేశారు
ఈ విలేకరుల సమావేశంలో ఫాదర్లు కాసు మర్రి రెడ్డి, టీ జోసెఫ్, పి సురేష్, సురేందర్, జి నవీన్, కిరణ్, ఆశీర్వాదం, ఫాతిమా చర్చి కమిటీ అధ్యక్షులు బి.దయాసాగర్,మత్యాస్ రెడ్డి, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

వార్త.. శ్యామ్🖋️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *