ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ
యజ్ఞ మహోత్సవం

తిరుమలగిరి, సెప్టెంబర్ 17 (విశ్వం న్యూస్) : శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం “తిరుమలగిరి బాలాజీ ఫంక్షన్ హాల్‌లో విశేషంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుంగతుర్తి శాసనసభ్యులు మండుల సామేలు గారు హాజరై, విశ్వకర్మ సమాజ శ్రేయస్సుకు ప్రభుత్వం అందించే సహకారం, సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ వేడుకలో విశ్వకర్మ సంఘం నాయకులు, గణనీయులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని యజ్ఞాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం ఆధ్యాత్మికత, భక్తిశ్రద్ధలతో నిండిపోగా, సమాజంలో ఐక్యత, సాంప్రదాయ విలువలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.