- పీర్జాదిగూడ రాఘవేంద్ర నగర్ లో నవ్య ట్రినిటీ అపార్ట్మెంట్ ఆపాలని ధర్నా
- కాలనీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి
ఆధ్వర్యంలో కాలనీవాసుల ధర్నా - ఇండ్ల మధ్యన డబుల్ సెల్లర్స్
అక్రమ కట్టడం ఆపాలని డిమాండ్ - రెసిడెన్షియల్ జోన్ లో పర్మిషన్
ఎలా ఇచ్చారు : కార్పొరేటర్ బల్చరాజు
మేడిపల్లి, మార్చి 31 (విశ్వం న్యూస్) : మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ డెకథ్లాన్ ఎదురుగా ఉన్నటువంటి ఆరోరా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ రోడ్ రాఘవేంద్ర నగర్ లో నిర్మిస్తున్న నవ్య ట్రినిటీ రెసిడెన్సి అపార్ట్మెంట్స్ ను ఆపివేయాలని రాఘవేంద్ర నగర్ కాలనీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అపార్ట్మెంట్ ముందు ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రెసిడెన్షియల్ జోన్ లో కమర్షియల్ అపార్ట్మెంట్ కు పర్మిషన్, ఎన్ ఓ సి ఎవరు ఇచ్చారని డిమాండ్ చేశారు. కనీసం ఇంతవరకు పర్మిషన్ ఏంటని అడిగిన చూపెట్టడం లేదని ఇది కచ్చితంగా అక్రమ కట్టడం అని వాపోయారు. 6 నెలల నుండి ఈ అక్రమ నిర్మాణం చేస్తూ.. అధికారులకు రాజకీయ నాయకులకు లంచాలు ఇచ్చుకుంటూ భారీ అక్రమ డబుల్ సెల్లర్స్ నిర్మిస్తున్నారని, ఈ అక్రమ నిర్మాణం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లు అదేవిధంగా అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ హౌస్ లు అన్ని కూలిపోయే పరిస్థితి ఉందని హెచ్చరించారు.
ఇప్పటికే అక్రమ సెల్లర్స్ పెద్ద పెద్ద బండలను మట్టి తవ్వకాలను తీయడానికి భారీ జెసిబిల ద్వారా సెల్లర్స్ మట్టి తవ్వకాలు పిల్లర్స్ పెద్ద పెద్ద రాళ్ళను తీయడానికి భారీ పేలుళ్లు జరుగుతున్నాయని, ఈ భారీ పేలుళ్లకు పర్మిషన్ ఎవరు ఇచ్చారని డిమాండ్ చేశారు. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్, మంత్రి, మేయర్, కమిషనర్ స్థానిక కార్పొరేటర్ ప్రత్యేక చొరవ తీసుకొని రాఘవేంద్ర నగర్ కాలనీ రెసిడెన్షియల్ జోన్ ప్రజలు అపార్ట్మెంట్ వాసులను దృష్టిలో పెట్టుకొని ఈ భారీ అక్రమ డబుల్ సెల్లర్స్ నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చుట్టుపక్కల కాలనీవాసులను, డివిజన్ ప్రజలను కలుపుకొని అపార్ట్మెంట్ ముందు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తానని, వీలైతే ఆమరణ నిరాహార దీక్షక్ కూడా దిగడానికి వెనకాడ భూమిని హెచ్చరించారు.
స్థానిక తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ బచ్చ రాజు మాట్లాడుతూ రాఘవేంద్ర నగర్ లో సెయింట్ పీటర్స్ స్కూల్ ప్లేస్ లో స్కూల్ నిర్మాణాన్ని తొలగించి నవ్య ట్రినిటీ రెసిడెన్సి అపార్ట్మెంట్స్ బిల్డర్స్ రెసిడెన్షియల్ జోన్ లో అక్రమంగా కమర్షియల్ అపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని ఈ భారీ అక్రమ డబుల్ సెల్లర్స్ నిర్మిస్తున్నారని, ఈ నిర్మాణం వల్ల, పేలుళ్ల వల్ల, భారీ క్రేన్ల శబ్దం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్ల ప్రజలు, అపార్ట్మెంట్ వాసులు నిద్రపోలేకపోతున్నారని, టీవీలు, ఫ్రిజ్ లు ఎలక్ట్రికల్ సామాన్లు పేలిపోతున్నాయని, ఇండ్లకు క్రాక్స్ వచ్చాయని, రాత్రి రెండు గంటల వరకు భారీ శబ్దాలతో కూడిన భారీ అక్రమ పేలుళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ఈ భారీ అక్రమ డబుల్ సెల్లర్స్ నిర్మాణం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.