పేదరికం ఓ సవాలు

వీణవంక, ఏప్రిల్ 1 (విశ్వం న్యూస్) : భారతదేశం మరియు తెలంగాణ రాష్ట్రంలో పేదరికం ప్రజల జీవితాలు, కఠిన పరిస్థితుల్లో సమస్యలో వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే ప్రధాన సమస్య, పేదరికం. అనేది ఒక వ్యక్తి లేదా కుటుంబానికి ప్రాథమిక కనీస అవసరాలు ఆహారం, దుస్తులు, నివాసం, విద్య, వైద్య సౌకర్యాలు తీర్చుకోలేని పరిస్థితిని పేదరికంగా చెప్పవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన ప్రజల పరిస్థితిని సూచిస్తుంది. అదనంగా వ్యక్తికి తగినంత జీవనం గడపలేక పోవడం. భారతదేశంలో పేదరికంతో బాధపడుతున్న చాలామంది ప్రజలు రోజుకు భోజనం అందని పరిస్థితి. అలాగే వారు రోడ్డు ప్రక్కన పడుకుంటున్నారు మురికి పాత బట్టలను ధరిస్తున్నారు. సరైన ఆరోగ్యకరమైన మరియు పోషకరమైన ఆహారం, మందులు లేదు ఇతర అవసరమైన వస్తువులు లభించవు, కనీస జీవన ప్రమాణాలు భరించలేని ఆర్థిక దుస్థితినీ పేదరికంగా చెప్పవచ్చు. పేద ప్రజలకు తగిన ఆదాయం లేదు వారు ప్రాథమిక మనుగడకు అవసరమైన గృహాలు ఆరోగ్య సౌకర్యాలు మరియు విద్యను విద్యను పొందలేరు కాబట్టి, పేదరికం కేవలం డబ్బు లేకపోవడం లేదా మరింత విస్తృతంగా రోజువారి మానవ జీవితానికి అడ్డంకులుగా అర్థం చేసుకోవచ్చు. ఉదా “ఒక వ్యక్తి నిరాశ్రయం అయినప్పుడు మరియు తగినంత డబ్బు లేనప్పుడు ఉన్న స్థితి పట్టణ ప్రాంతాలలోని జనాభా కారణంగా భారతదేశంలోని పేదరికం రేటు పెరుగుదల మరి ముఖ్యంగా కోట్ల మంది ప్రజలు వారి దారిద్రరేఖను దిగువన ఉన్నారు. మరియు చాలామంది ప్రజలు పేదరికపు సరిహద్దుల్లో ఉన్నారు. భారతదేశంలో పేదరికం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో విద్యావంతులు మరియు నిరుద్యోగులు మరియు పెరిగిన జనాభా కారణంగా కనిపిస్తుంది. చాలామందికి వారి దయనాందిన జీవితాల్లోకి సరైన ఆహారం లభించదు. వారు దారిద్ర రేఖకు క్రింద ఉన్నవారని వారిని ఈ క్రింది విధంగా అంచనా వేస్తారు.

అంటే రోజువారి పౌష్టిక విలువలను ప్రామాణికంగా తీసుకొని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో వేరువేరు దారిద్ర్య రేఖ సూచిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో రోజుకు 2400 కేలరీలను, పట్టణ ప్రాంతాల్లో 2100 కంటే తక్కువ కేలరీల అందుబాటును దారిద్రరేఖగా ప్రతిపాదిస్తారు. భారతదేశంలో ప్రస్తుతం 141.2 కోట్ల జనాభా ఉంటే అందులో *29.85 కోట్ల జనాభా పేదరికంలో పేదరికంలో నివసిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో 3.86 లక్షల జనాభాలో 49 లక్షల మంది ప్రజలు పేదరికంలో నివసిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమాచార రంగాల్లో ఎంతో ముందున్న ప్రజల జీవితాల్లో పేదరికం సమస్య అనేది పోవడం లేదు. పేదరికం, నిరుద్యోగిత దేశ అభివృద్ధికి పెద్ద సమస్యగా పరిణమించాయి. ఈ పదాలకు నిర్వచనాలు కూడా తరచుగా మారుతున్నాయి. కనీస జీవన ప్రమాణాలు లోపించడం, పౌష్టిక ఆహార లోపం, నిరక్షరాస్యత, మానవ అభివృద్ధిలో వెనుకబాడుతనం మొదలైనవి పేదరిక లక్షణాలుగా చెప్పవచ్చు.
పేదరికాన్ని రెండు రకాలుగా నిర్వచించవచ్చు.

1) నిరుపేక్ష పేదరికం. 2) సాపేక్ష పేదరికం
నిరుపేక్ష పేదరికం: కనీస జీవన ప్రమాణంలోని వివిధ అంశాలను నిర్దిష్ట ప్రమాణాలలో పరిగణలోకి తీసుకొని, ఆ ప్రమాణంలోనికి దిగువన ఉన్న వ్యక్తులందరినీ దారిద్ర రేఖకు దిగువ ఉన్న వారిగా గుర్తిస్తారు. ఉదా” భారతదేశంలోని పేదరికం.
సాపేక్ష పేదరికం: వివిధ వ్యక్తులు లేదా సమూహాలకు అందుబాటులో ఉన్న వనరులు, వేతనం సంపద తదితరాలలోని అసమానతల ఆధారంగా సాపేక్ష పేదరికం లెక్కిస్తారు ఉదా” అభివృద్ధి చెందిన దేశాలు పేదరికం. పేదరికానికి గల కారణం ఏమిటి పేదరికానికి వివిధ కారణాలు ఉన్నాయి. భారతదేశంలో నిరుద్యోగం లో ఉన్న వ్యక్తులు పట్టణ జనాభా పెరుగుదల కారణంగా భారతదేశం మరియు తెలంగాణ రాష్ట్రం పేదరికం రేటు పెరిగిపోతుంది. గ్రామీణ ప్రజలు మంచి ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు. వీరిలో చాలామంది వ్యక్తులు తక్కువ జీతం లేని ఉద్యోగం లేదా వారి ఆహారం కోసం మాత్రమే చెల్లించే కార్యాచరణను కనుగొంటున్నారు. మరి ముఖ్యంగా, కోట్లాది మంది పట్టణ ప్రజలు దారిద్రరేఖన దిగున ఉన్నారు. చాలా మంది ప్రజలు పేదరిక సరిహద్దులోనే ఉన్నారు. భారతదేశంలో పేదరికం యొక్క అతిపెద్ద సమస్య ఏమిటంటే దేశం యొక్క వేగవంతమైన జనాభా పెరుగుదల ఫలితంగా నిరక్షరాస్యత, పెరుగుతున్న జనాభా సరైన విద్య మరియు శిక్షణ లేకపోవడం. ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ప్రజలు తమకు పని దొరకక, వీరిలో ఎక్కువమంది అసంఘటిత శ్రామిక రంగంలోనే ఉంటూ ఎటువంటి, సాంఘిక భద్రత లేక పేదరికంలో మగ్గుతున్నారు.
మిగతావారు జీవనోపాధి పొందలేకపోతున్నారు, దీంతో వారికి ప్రాథమిక అవసరాలైన నాణ్యమైన విద్య, అందించలేకపోవడం ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మరియు ఆర్థిక వనరుల కొరత ఎక్కువగా ఇంకా అధిక జనాభా వృద్ధిరేటు వ్యక్తిగత ఆదాయంపై ప్రభావం చూపుతుంది, వ్యక్తిగత ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. త్రాగునీరు, పారిశుధ్యం, అందడం లేదు కుటుంబాన్ని, పిల్లలను పోషించలేకపోతున్నారు. పేదరికం యొక్క ఇతర కారణాలు, ప్రకృతి వైపరీత్యాలు రాజకీయ అస్థిరత మొదలైన ఉన్నాయి. పేదరిక నిర్మూలనకు వ్యక్తులు ప్రభుత్వాలు ఎలాంటి కృషి చేయాలి. పరిష్కార మార్గాలను ప్రభుత్వ విధానాలు అమలు చేయాలి భారతదేశ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి వేగాన్ని వేగవంతం చేయడం, పేదరిక సమస్యను పరిష్కరించవచ్చు. ఆర్థిక అభివృద్ధి రేటు మరియు ఆదాయాన్ని సంపాదించడం పేదరిక నిర్మూలనకు మొదటి అడుగు, ప్రజలకు సాధికారిక కల్పించడం ద్వారా పేదరికం నిర్మూలించవచ్చు మరియు వారి కి మంచి విద్యను అందించడం ద్వారా వారు మెరుగైన వృత్తిని, మరియు భవిష్యత్తును కలిగి ఉంటారు.

విద్య సహాయంతో ప్రజలు మంచి ఉద్యోగాలను పొందగలరు, తద్వారా వారు మంచి జీవనోపాధి పొందగలరు. అధిక వృద్ధిరేటు కొత్త ఉపాధిని మరియు ఆదాయాన్ని సంపాదించే అవకాశాలను సృష్టిస్తుంది. ఉత్పాదకత మరియు ఉత్పత్తిని మెరుగుపరచడానికి ఉత్పత్తి యొక్క కొత్త మరియు ఆధునిక పద్ధతులను చేర్చడానికి ప్రయత్నాలు చేయాలి అదే విధంగా వ్యవసాయ రంగంలో ఆధునిక యాంత్రికరణ అనుసరించే ఉత్పత్తిని మెరుగుపరచాలి, ఉత్పత్తిలో పెరుగుదల అధిక ఆదాయానికి దారితీస్తుంది. మరియు తద్వారా పేదరిక నిర్మూలన సహాయపడుతుంది. వేగవంతమైన ఆర్థిక అభివృద్ధికి అదనంగా పెరిగిన ఆదాయం కొద్ది మంది చేతిలోకి ఉండ కుండా చూసుకోవడం అవసరం, మరో మాటలో చెప్పాలంటే పేదరికం ని తొలగించడానికి ప్రజల్లో ఆదాయం మరియు సంపద యొక్క ఆర్థిక అసమానతలు తొలగించడం అవసరం, శాసన మరియు ఆర్థిక చర్యల ద్వారా దీనిని సాధించవచ్చు. శాసనపరమైన చర్యలలో కనీస వేతనాల చట్టం, కనీసం మద్దతు ధర, విద్య హక్కు చట్టం మొదలైనవి కచ్చితంగా, కఠినంగా అమలు చేయాలి. ప్రభుత్వ సేవలను ప్రజలకి సమస్యలు త్వరగా పరిష్కరించి దిశగా ప్రభుత్వ విధానాలను తీసుకురావాలి. ఇటువంటి చర్యలు ప్రజల ఆదాయాన్ని అర్జించే సామర్థ్యాన్ని పెంచుతాయి. వారి మెరుగైన జీవన ప్రమాణాలు అందించవచ్చు. తద్వారా తమ పిల్లలకు మెరుగైన జీవితాన్ని అందించగలుగుతారు. పేదరికాన్ని తొలగించడంలో సహాయపడడానికి ప్రజలకి మంచి రవాణా సౌకర్యం, సమాచార కమ్యూనికేషన్, సాంకేతికలు మరియు ఇతర ముఖ్యమైన ప్రజా సౌకర్యాలు మరియు సేవలను సులభంగా యాక్సెస్ ఇవ్వాలి.
భారతదేశంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇది కొన్ని సంవత్సరాల కార్యక్రమం ప్రధానమంత్రి రోజర్ యోజన, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ రోజ్ గార్ యోజన, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, స్వర్ణజయంతి షహరీ రోజ్ గారీ యోజన, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, దీన్ దయాల్ అంత్యోదయ యోజన వంటి వివిధ కార్యక్రమాలు మరియు పథకాలను ప్రారంభించింది, గ్రామీణ ప్రాంతాలలో నివసించే పేదలకు నైపుణ్యం లేని వారికి వేతన ఉపాధిని కల్పిస్తుంది, పేద మహిళలు, వృద్ధులు మరియు వితంతుల కొన్ని పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర పథకాలు ఏవి వచ్చినా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఉపయోగపడే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు తీసుకురావాలి. అవినీతికి తావు లేకుండా పేదరికంలో ఉన్న ప్రజలకి నిజాయితీగా, జవాబుదారీగా, ఉంటూ ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అర్హులైన కఠిన పేదరికం అనుభవించే ప్రజలకి అందించడం ద్వారా పేదరికం తొలగించవచ్చు. పేదరికంలో నా కఠిన జీవితాన్ని గడిపిన ఎన్నో సమస్యలు చూసిన వ్యక్తిగా, పేదరికం సమస్య లేని సమాజంలో ప్రజలందరూ మెరుగైన జీవన ప్రమాణాలు జీవించాలని ఉద్దేశంతో ఈ వ్యాసరచన చేయడం జరిగింది.

