ఆరు దాటితే భయం.. భయం.. వెలగని వీధి దీపాలు

అంధకారంలో పలు వీధులు

  • పరిష్కరించండి కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్

హైదరాబాద్, జనవరి 13 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటవ వార్డు బృందావన్ కాలనీలో వారం రోజుల నుండి వీధి దీపాలు వెలగడం లేదు. వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. వార్డుల్లో లైట్లు ఎప్పుడు వెలుగుతాయో, ఎప్పుడు ఆరిపోతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.

కొన్ని చోట్ల పగలు, రాత్రి తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. కొన్ని వార్డుల్లో రెండు, మూడు రోజులపాటు లైట్లు వెలగక అంధకారం అలముకుంది.

  • కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ వెట్టనే వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని కాలనీ ప్రజల విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *