నెహ్రూ విగ్రహం నెలకొల్పడంలో నిర్లక్ష్యం వద్దు : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

నెహ్రూ విగ్రహం నెలకొల్పడంలో
నిర్లక్ష్యం వద్దు:కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

  • కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన నగర కాంగ్రెస్
  • పదిహేను రోజులలో స్పష్టత రాకపోతే కార్యచరణ ప్రకటిస్తాం

కరీంనగర్ బ్యూరో, ఏప్రిల్ 18 (విశ్వం న్యూస్) : సవారాన్ స్ట్రీట్ కూడలి వద్ద ఉన్న నెహ్రూ విగ్రహాన్ని రెండు సంవత్సరాల క్రితం రోడ్డు వేసే క్రమంలో తీసి తిరిగి ఇంతవరకు నెలకొల్పడం లేదని వెంటనే నెలకొల్పాలని నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక భూమిక పోషించడమే కాకుండా దేశ మొట్టమొదటి ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికలతో దేశఅభివృద్ధికి బీజాలు వేసిన మహనీయుని విగ్రహం విషయంలో నిర్లక్షం తగదని అన్నారు.

రెండు సంవత్సరాలుగా మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాలు సమర్పించడమే కాకుండా నిరసన కార్యక్ర మాలు చేపట్టినప్పటికీ నిర్లక్యం వీడకపోవడం బాధాకరం అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.పదిహేను రోజులలో స్పష్టత రాకపోతే తదుపరి కార్యాచరణ నాయకులు కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో గుండాటీ శ్రీనివాస్ రెడ్డి,శ్రవణ్ నాయక్, కుర్ర పోచయ్య,దండి రవీందర్,ఎండి చాంద్,ముక్క భాస్కర్,మామిడి సత్యనారాయణ రెడ్డి,మేకల నర్సయ్య, పొరండ్ల రమేష్,మెతుకు కాంతయ్య, షబానా మహమ్మద్, నెల్లి నరేష్, అన్న జ్యోతి, కీర్తి కుమార్, షేహెన్ష, పద్మ,శివరాం, నదీమ్,జాఫర్, మహమ్మద్ భారీ, అనిల్ కుమార్, కమల్, బషీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *