ఘనంగా పీర్జాదిగూడలో శ్రీశ్రీశ్రీ కట్ట
మైసమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన
- ముఖ్య అతిథులు మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా దేవాలయం ప్రారంభం
- మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి..
- మేయర్ జేవియర్, డిప్యూటీ మేయర్ శివకుమార్ హాజరు
- కార్పొరేటర్ అల్వాల సరిత దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన
పీర్జాదిగూడ, జూన్ 14 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్ కార్పొరేటర్ ఆలువాల సరిత దేవేందర్ గౌడ్ ల ఆధ్వర్యంలో పీర్జాదిగూడ పెద్ద చెరువు లేక్ ఫ్రంట్ పార్క్ క్రింద శ్రీశ్రీశ్రీ కట్ట మైసమ్మ దేవాలయంలో పంచ వేద పండితుల చేతుల మీదుగా శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు స్థానిక కార్పొరేటర్ అల్వాల సరిత దేవేందర్ ల ఆధ్వర్యంలో వారి సొంత నిధులతో కొంతమేరకు దాతల సహాయ సహకారాలతో నిర్మించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరై శ్రీ కట్ట మైసమ్మ దేవాలయం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి దేవాలయం ఏర్పాటు స్థానిక కార్పొరేటర్ అల్వాల సరిత దేవేందర్ గౌడ్ లు తన సొంత నిధులతో ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ,దేవాలయ ప్రారంభం 3 రోజులుగా వేద పండితుల చేతుల మీదుగా చండి యాగాలు తదితర కార్యక్రమాలను సక్సెస్ చేయడం పట్ల ప్రత్యేకించి అభినందించారు. అదేవిధంగా దగ్గరుండి తన డివిజన్లో పీర్జాదిగూడ పెద్ద చెరువు లేక్ ఫ్రంట్ పార్కును కోట్లాది రూపాయలతో నిర్మించిన పార్క్ ను దగ్గరుండి సుందరీ కరణ కార్యక్రమాలను చూసుకోవడం పట్ల మేయర్, డిప్యూటీ మేయర్,స్థానిక కార్పొరేటర్ విజయం సాధించారని, అతి త్వరలోనే ఈ పార్కును ప్రారంభించడం జరుగుతుందని, చుట్టుపక్కల ఉన్నటువంటి పీర్జాదిగూడ కార్పొరేషన్ ప్రజలందరికీ మేలు జరుగుతుందని తెలియజేశారు. మరో ముఖ్య అతిథులు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
గౌరవ అతిథులుగా మేయర్ జక్క వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 19వ డివిజన్ కార్పొరేటర్ అల్వాల సరిత దేవేందర్ గౌడ్ పట్టు విడవని విక్రమార్కుల లాగా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన తదితర కార్యక్రమాలలో విజయం సాధించారని, అదేవిధంగా కోట్లాది రూపాయలతో పెద్ద చెరువు సమీపంలో లేక్ ఫ్రంట్ పార్క్ సుందరీకరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఇది రెండో విజయంగా మేము భావిస్తున్నామని, వారి పట్టుదలనే వీటన్నిటికీ కారణమని కొనియాడారు.
స్థానిక కార్పొరేటర్ సరిత దేవేందర్ గౌడ్ లు మాట్లాడుతూ శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి కటాక్షం, కృపతో తెలంగాణ రాష్ట్రం పీర్జాదిగూడ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు కలిగి జీవించాలని,అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రత్యేకంగా కోరుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ జెడ్పీ సభ్యులు మందసంజీవరెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పలు పర్టీల నేతలు, పీర్జది గూడ గ్రామ ప్రజలు, నాయకులు, ప్రజలు, యువత మహిళలు, తదితరులు హాజరై అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.