స్వచ్ఛంద రక్తదానం
యువతకు నినాదం కావాలి

48 సార్లు రక్తదాత-గాలిపల్లి కుమార్ పిలుపు
తిమ్మాపూర్,, జూన్ 14 (విశ్వం న్యూస్) : ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా బుధవారం కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామానికి చెందిన గాలిపల్లి కుమార్ మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటి వరకు స్వచ్ఛందగా 48సార్లు రక్తదానం చేయడం జరిగిందన్నారు. తనది ఏ ప్లస్ బ్లడ్ గ్రూపు అని, తాను గత 12 సంవత్సరాల నుండి రక్త దానం చేయడం ప్రారంభించాను. ప్రాణాపాయ స్థితిలో రక్తం అవసరం ఉన్న రోగులకు యువతకు రక్తదానం పై అవగాహన కల్పించి స్వచ్చందంగా రక్తదానం చేసే విదంగా కృషి చేశాను. రక్తదానంతో పాటు అవయ దానం ప్రాముఖ్యత గురించి చెప్పడం అవగాహన కల్పిస్తున్నానని పేర్కొన్నారు. రక్తదానం చేయడం సామాజిక సేవలో తన వంతు బాధ్యత గా స్వీకరిం చాను.
తలసేమియూ వ్యాధి గ్రస్తులకు, గర్భిణి స్త్రీలకు, యాక్సిడెంట్ అయిన వారికి రక్తం చాలా అవసరం ఉంటుంది, కనుక దాతలు, యువత కూడా ముందుకు వచ్చి మరింత బాధ్యతగా రక్తదానం చేయవలసినదిగా కొరుకుంటున్నాను. సామాజిక సేవలో భాగంగా ఆకలితో ఉన్న వారికి నిరుపేదలకు అనాధలకు వృద్ధులకు మానసిక వికలాంగులకు రోడ్ సైడ్ నిరాశ్రయులకు బట్టలు నిత్యావసర సరుకులు భోజనం ఇవ్వడం జరుగు తుందన్నారు. నిస్వార్థంగా ఈ సేవా కార్యక్రమాల నిర్వహిస్తున్నదుకు గుర్తించిన పలు స్వచ్ఛంద సేవాసంస్థల వారు ఎన్నో అవార్డులు సన్మానాలు సత్కారాలు పొందడంతో పాటు ఇటీవల సామాజిక సేవ రంగంలో విశిష్ట సేవలను అందిస్తు న్నదుకు గాను అవార్డులు తీసుకోవడం జరిగిందని, భవిష్యత్ లో కూడా ఈ సేవా కార్యక్రమాలను మరిం త బాధ్యత తో కొనసాగిస్తానని తెలియజేస్తూ ప్రజలం దరికీ ప్రపంచ రక్త దాతల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.