అసమర్థ ఎమ్మెల్యే మంత్రి గంగుల

  • దిక్కులేని ఎంపీ బండి సంజయ్
  • నిర్లక్ష్య నగర మేయర్ వై.సునీల్ రావు

కరీంనగర్ నగర అభివృద్ధి పేరుతో పూటకో డ్రామా, రోజుకో వేషం వేస్తూ ప్రజలని మభ్యపెడుతూ ప్రజా ధనం దోపిడీ చేస్తున్నారని ఎమ్మెల్యే మంత్రి గంగుల కమలాకర్ అసమర్థుడని, నగర మేయర్ వై. సునీల్ రావుది నిర్లక్ష్య వైఖరి అని, అసలు ఇటువైపు కూడా చూడని దిక్కులేని ఎంపీ బండి సంజయ్ అని విమర్శించారు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్. ఇప్పటికే పలుమార్లు కేబుల్ బ్రిడ్జి ప్రాభోత్సవ తేదీలను వాయిదా వేస్తూ వచ్చారని దీనిపై సిగ్గుపడకుండా బీఆరెస్ శ్రేణులతో అభివృద్ధి ప్రదాత అంటూ పొగిడించుకుంటున్నారని ఎద్దేవా చేశారు సుజిత్ కుమార్. ఎలాంటి అభివృద్ధి జరిగినా అది ప్రజాధనంతో జరుగుతున్నదే అని, దేశంలో రాష్ట్రంలో పాలకులు చేస్తున్న లక్షల కోట్ల అప్పులకి భవిష్యత్తులో బాధ్యులుగా ఉండేది ప్రజలే అని గుర్తుంచుకోవాలని అధికార పార్టీ శ్రేణులకు సూచించారు.

కేబుల్ బ్రిడ్జి పనులు మొదలుపెట్టి ఐదేండ్లు నిండినా ఇంకా ప్రారంభం కాకపోవడం చూస్తుంటే అసలు ఈ విషయంలో విజిలెన్సు లేకుండా ఉంటున్న ఎంపీ ని చూస్తుంటే అసలు పాలకులకు చిత్తశుద్ధి ఉందా అనే అనుమానం రాక మానదు అన్నారు. కేబుల్ బ్రిడ్జి పై ప్రభుత్వం 183 కోట్ల రూపాయలు కేటాయించిన విషయం, అక్కడ లైటింగ్ కోసం 8 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని మర్చిపోవద్దన్నారు.

హైదరాబాద్ దుర్గం చెరువుపై ఇదేరకమైన బ్రిడ్జి పనులు ఏడాదిన్నరలో పూర్తి చేసి ప్రజలకి 2020 లోనే అందుబాటులోకి తెచ్చారని కానీ కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి అంటూ ఆరేడేళ్ళనుండి శివారు గ్రామాల్లో రియల్-ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున చేస్తూ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని మాత్రం పదే పదే ప్రకటిస్తూ రియల్ ఎస్టేట్ దందాలు భూమి ధరలు అధికమయ్యేలా చేస్తున్నారని ఆరోపించారు సుజిత్ కుమార్.

కరీంనగర్ నగర అభివృద్ధి కోసం ఇప్పటికే వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ అన్ని పనులు ప్రణాళికేతరంగా, అసంపూర్ణంగా ఉన్నాయని, కేవలం కాంగ్రెస్ పార్టీ కి మాత్రమే అభివృద్ధి విషయంలో ప్రజాధనం సక్రమంగా వినియోగించే విషయంలో చిత్తశుద్ధి ఉన్నదని ఈ అంశంపై బహిరంగ చర్చకు అధికార బీఆరెస్ బీజేపీ పార్టీ లు సిద్ధమా అని పత్రికా ప్రకటన ద్వారా సవాలు విసిరారు మల్యాల సుజిత్ కుమార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *