ఇండియా ఛాలెంజ్: మొక్క నాటిన
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోడలు

హైదరాబాద్, ఏప్రిల్ 28 (విశ్వం న్యూస్) : ఈరోజు తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని తన ఇంటి అవరణలో మొక్క నాటిన క్లిమామ్ గోషాల నిర్వహకురాలు, ఐకె ఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ కో కన్వీనర్ శ్రీమతి అల్లోల దివ్యారెడ్డి.
రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోడలు అల్లోల దివ్యా రెడ్డి తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటిన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ఎంపీ శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా మొక్కలు నాటి వాటిని కాపాడాలని కోరుకుంటున్న అన్నారు.