చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లతోనే మహిళా సాధికారిత

భారత దేశం:చట్ట సభల్లో మహిళా
రిజర్వేషన్లతోనే మహిళా సాధికారిత

హైదరాబాద్, ఆగస్టు 26 (విశ్వం న్యూస్) : ఒక దేశ ప్రగతి పురోగతి స్త్రీ పురుష సమానత్వంపై ఆధారపడి ఉంటుంది.మానవ వనరుల్లో సగభాగమైన మహిళలకు ప్రాధాన్య మిస్తున్న ఇస్తున్న దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది అగ్రస్థానంలో నిలిచాయి. స్త్రీ పురుష అసమానతలు ఎక్కువగా వున్న దేశాలు ఆర్థికంగా ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదు. ప్రపంచ ఆర్థిక ఫోరం 2022 నివేదిక ప్రకారం ప్రపంచములోని లింగ సమానత్వ సూ భారత దేశం 146 దేశాల్లో 135 వ స్థానములో నిలిచింది. స్ర్తీ పురుష సమానత్వం కోసం తీసుకున్న నాలుగు ప్రధాన అంశాలు తీసుకొని అంచనా వేశారు 1 ఆర్థిక బాగస్వామ్యంలో143 వ స్థానం రాజకీయ సాధికారిత అధికారం లో 48వ స్థానం విద్యాభ్యాసంలో 107 వ స్థానం నిలిచిన భారత దేశం వైద్య రంగములో అట్టడుగు 146వ స్థానములో వుంది. సమానత్వ సుచిలో 135. వ స్థానములో ఉన్న మనదేశం కంటే కేవలం 11 దేశాల మాత్రమే ఉనాయి. మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నేపాల్ లాంటి చిన్న దేశాలు స్త్రీ పురుష సమానత్వంలో మనకంటే ముందు ఉన్నాయి.

మన దేశంలో లోసభలో 543 పార్లిమెంట్ సభ్యులు ఉంటే మహిళా సభ్యులు. 66 మంది మాత్రమే వున్నారు. మొదటి లోకసభలో మహిళా ఎం పిల సంఖ్య22 కాగా ప్రస్తుత లోకసభలో మహిళా ఎంపి ల సంఖ్య66 మాత్రమే అధికార రాజకీయపార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు మహిళా సాధికారిత ను మాటలకీ పరిమితం చేశాయి . మహిళా ప్రాతినిధ్యం పెంచడానికి కృషి చేయలేదు. శాసన నిర్మాణ వ్యవస్థలో స్త్రీల భాగస్వామ్యం అతి తక్కువగా వుంది. మన పార్లమెంట్ ఉబయ సబల్లో మహిళా ఎంపి ల వాటా 15 శాతం లోపే వుంది .ప్రస్తుత లోకసభలో 81 మంది రాజ్య సభలో 29 మంది మహిళా ఎంపిలున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళా ఎమ్మెల్యే సగటు సంఖ్య 8 శాతం లోపే వుంది. తెలంగాణ ఏర్పడిన తొలి కేబినెట్లో ఒక్క మహిళా మంత్రి లేరు ప్రస్తుత ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు.ఇటీవల గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఇదే కథ పునరావృతమైంది .మహిళా రిజర్వేషన్స్ బిల్లు మరో సారి పార్లమెంట్లో ప్రవేశ పెట్టాలని సుప్రీంకోర్టులో‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది .తాజా పరిణామాలు చట్టసభల్లో స్త్రీల ప్రాతినిధ్యం మహిళా రిజర్వేషన్ మీద చర్చకు దారితీసాయి. న్యాయ శాఖ మంత్రి లోకసభలో వెల్లడించిన గణాంకాలు రాజకీయ పార్టీల చిత్తశుద్ధిని ప్రస్ఫుటం చేశాయి . ఆకాశములో సగం అవకాశాల్లో సగం అనే నినాదం నినాదంగా నే మిగిలిపోయింది ? స్త్రీలు పురుషులతో సమానంగా అభివృధి చెందడం లేదు.

జనాభాలో సగం వున్న
మహిళలకు చట్టసభల్లో 33 శాతం
రిజర్వేషన్స్ చట్టం చేయడానికి రాజకీయ పార్టీల నేతలు మీన మేశాలు లెక్కిస్తూ తీవ్ర జాప్యం చేస్తున్నారు. మహిళలకు ఒక సారి సీట్లు రిజర్వ్ చేస్తే శాశ్వతంగా తమకు అధికారం దక్కధన్నభావన మహిళా బిల్లు ఆమోదం గాకుండా అడ్డుపడుతుంది.1996 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు .అనేక పరిణామాలు అపరిమిత ఆలస్యం తర్వాత2010 లో బిల్లును రాజ్యసభ ఆమోదించింది. నాటి లోకసభ కాల పరిమితి తీరిపోవడం తోఆబిల్లు అమలుకు నోచుకోలేదు. ఇటీవల కాలములో మహిళా బిల్లు పార్లమెంట్లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ పెరిగింది. లింగ సమానత్వం ద్వారా స్త్రీ’ పురుషుల కు సమన్యాయం కలిపించడానికి కట్టుబడిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు తేవడానికి పార్టీల మధ్య ఏకాభిప్రాయం అనే సాకుతో ఆలస్యం చేస్తున్నారు.

మహిళా సాధికారిత సాధనకు కట్టుబడి వున్నామని మహిళా సంక్షేమమే మానవ సంక్షేమమని చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెడతామని ఎన్నికల మేనిఫెస్టోల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించి మహిళలకు ఉచిత విద్య ‘బాలికలకు ఉచితంగా సైకిల్లు ఇవ్వడం కంప్యూటర్’ లాప్టాప్ లు ఇవ్వడం ఉచితాల ప్రకటనల్లో పోటీ పడుతున్న రాజకీయ పార్టీలు మహిళలకు వెనుకబడిన వర్గాల వారికి వారి జనాభా దామాషా ప్రకారం సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వడంలో నిర్లక్ష్యాన్ని ఉదాసీనత ను సాచివేత వైఖరిని అవలంబించడం శోచనీయం . రాజ్యాధికారంలో సమాన వాటా పొందక రాజ్యాంగ పితామహుడిగా కీర్తి గడించిన బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయ మైన ప్రజాస్వామిక న్యాయం మహిళలు వెనుకబడిన వర్గాల వారికి అందని ద్రాక్ష అయ్యింది.అధికార పార్టీ ప్రతి పక్ష పార్టీలు ఎన్నికల సమయంలో మహిళలను’ బి’సి లను “వోటు బ్యాంకుగా ‘వాడుకుంటున్నారు. పార్టీలు టికెట్ల కేటాయింపు లోపంపిణీలో మగవాళ్ళకె పెద్ద పీట వేస్తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సం” రాలైనప్పటికి అమృతోత్షవాలు జరుపుతున్న ప్పటికి దేశ జనాభాలో సగం వున్న మహిళలకు శాసన నిర్మాణములో అతి తక్కువ స్థానం ఇవ్వడం.

సమంజసం కాదు తక్కువ సంఖ్యలో వున్న వారు అధికారాన్ని చెలాయిస్తూ.అధిక సంఖ్యాకులైన మహిళలు మరియు వెనుకబడిన వర్గాల వారు రాజ్యాధకారానికి దూరంగా ఉండడం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని సామాజిక ‘పాలన ‘రాజనీతి వేత్తలు :న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచ దేశాలు మహిళా ప్రాతినిధ్యం 2022 లెక్కల ప్రకారం.అమెరికా ఐరోపా సహారా ఎడారికి దక్షిణాన వుండే సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతాలలో జాతీయ పార్లమెంట్లో ప్రపంచ సగటు 26.2 శాతం కన్నా ఎక్కువే మహిళలుఎం ‘పి లు గా వున్నారు.నేపాల్ లో 34 శాతం బంగ్లాదేశ్ 21 శాతం పాకిస్థాన్ 20 శాతం భూటాన్ 17 శాతం మన దేశం కన్న మెరుగుగా ఉన్నాయి.ఆసియా దేశాల్లో19.2 శాతం అరబ్ దేశాల్లో 18.4 శాతం పసిఫిక్ దేశాల్లో 13.5 శాతం వుంది.

మాన దేశంలో 10 నుండి
15 శాతం లోపు మహిళా ఎం.పిలు
ప్రపంచం మొత్తం మీద కేవలం రెండు దేశాల్లో మాత్రమే పార్లమెంట్లో 50 శాతం కంటే ఎక్కువ మహిళా ప్రాతినిధ్యం కలిగి వున్నారు.2016జూన్ గణాంకాల ప్రకారం రువాండా దేశంలో‌ 63.8శాతం బోలివియా లో 53.1 శాతం వుండగా 30 శాతం కంటే ఎక్కువ మహిళా ప్రాతినిధ్యం గల.దేశాల సంఖ్య పెరిగింది. రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్యం ఇవ్వడంలో ఇతర దేశాల కంటే మన దేశం చాలా వెనుకబడి వుంది. పురుషులతో సరిసమాన సంఖ్యలో వున్న మహిళలు ఓటు హక్కును పురుషులతో పాటు సమానంగా వినియోగించుకున్నప్పటికి మహిళలకు చట్ట సభల్లో సముచిత స్థానం దొరకడం లేదు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ ఉన్నపటికీ 90 శాతం మగవారే పెత్తనం చెలాయిస్తున్నారు.

మహిళను రాజకీయ
రంగములో ప్రోత్సహించాలి
ఎన్నికల్లో పోటీ చేస్తే పురుషుల కన్న మహిళలకే విజయావకాశాలు ఎక్కువ వుంటాయి.మహిళలు పోటీ చేస్తున్న స్థానాలలో ఎన్నికల వ్యయం తక్కువ వుంటుంది. సమాజములో సగా బాగమున్న మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వడం ద్వార మహిళలకు‌ ప్రజాస్వామిక న్యాయం‌‌ జరుగుతుంది.ప్రాతినిధ్య ప్రజాస్వామ్యా లక్ష్యం నెరవేరుతుంది.రాజ్యాంగంలో పొందుపరచిన స్త్రీ పురుష సమానత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పించడి సామాజిక ఆర్థిక రాజకీయ పంపిణీ న్యాయం సిద్ధిస్తుంది. రాజకీయ పార్టీలు మహిళలకు చట్టసభల్ల కచ్చితమైన శాతాన్ని రిజర్వ్.చేస్తెనే ఆయా పార్టీల గుర్తింపు కొనసాగుతుందనే నిబంధన ఎన్నికల కమిషన్ విధించాలని గిల్ ఫార్ములా సిఫారసు చేసింది.ఈ దిశగా ఎన్నికల కమిషన్ సమగ్ర సంస్కరణలు అమలు చేయాలి. పార్టీలు మహిళలకు సముచిత స్థానం అన్ని రాజకీయ పార్టీలు మహిళలకు చట్టసభల్లో వారి జనాభా దామాషా ప్రకారం టికెట్టు ఇచ్చి వారికి చట్ట సభల్లో సముచిత స్థానం ఇవ్వాలి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రివర్గ ములో మహిళలకు స్థానం ఇవ్వాలి నీతి ఆయోగ్ లాంటి ఉన్నత స్థాయి రాజకీయ నిర్ణయాలలో స్త్రీ పురుషులకు సమాన భాగస్వామ్యాన్ని కలిపించాలి . ఉపాధి ఉదోగ కల్పనలో వున్న అసమానతలు లింగ వివక్షత రూపుమాపాలి. మహిళా సాధికారిత సాధనకు అనువైన వాతావరణాన్ని సృష్టించాలి. మహిళల మీద బాలికల మీద జరుగుతున్న హింస అత్యాచారాలను అరికట్టాలి. స్త్రీల సమాన హక్కులు కలిపించలి. ప్రజాజీవితంలో రాజకీయ ఆర్థిక సామాజిక నిర్ణయాలలో నిర్మాణములో మహిళలకు క్రియ శీల ప్రాతినిధ్యం నాయకత్వానికి సమాన అవకాశాలు కల్పించాలి. మహిళా సాధికారిత ద్వారా ఆర్థిక అసమానతలు కాలుష్య రహిత పర్రువరణ వ్యవస్థ ఏర్పడుతుంది. మహిళలు రాజకీయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. మహిళలు నాయకత్వ లక్షణాలు పెoపొందించుకోవలి. మహిళలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. పాలనా సంస్థల్లో సహకార ఉద్యమములో పౌర సంఘాలలో మహిళలు చురుకుగా పాల్గొనాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించి భంగపడకుండ మహిళలు తమ హక్కుల రక్షణ భద్రత సంరక్షణ సంక్షేమ పథకాల మీద చట్టాల మీద అవగాహన చైతన్యం పెంచుకో.వాలి. స్థానిక సంస్థల ప్రత్యక్ష ఎన్నికల్లో1/3 వంతు సీట్లు మహిళలకు కేటాయిస్తూ ప్రవేశ పెట్టిన చట్టాలు సమర్థవంతంగా అమలు చెయ్యాలి. రాజకీయ పార్టీలు మహిళలకు చట్టసభల్లో టికెట్లుఇవ్వడానికి పార్టీల పరంగా నియమ నిబంధనలు రూపొందించుకోవాలి పార్టీల రాష్ట్ర జిల్లా స్థాయి ఆఫీస్ బరెర్లలో మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలి.

మహిళా సంఘాలు స్వశక్తి మహిళా గ్రూపులు డ్వాక్రా మహిళలు ప్రతి గ్రామ పంచాయితీ స్థాయిలో వున్న తల్లుల సంరక్షణ సంఘాలు పొదుపు సంఘాల ప్రతి నెల జరిగే సమావేశాల్లో మహిళా సాధికారిత సాధన మహిళల రాజకీయాల పట్ల చర్చించి అవగాహన పెంచుకోవాలి. మహిళలను కించ పరిచే అన్ని రకాల వివక్షలను రూపుమాపాలి. స్త్రీలను చిన్న చూపు చూసే సమాజ పరిస్థితులు మారాలి. మహిళల పట్ల గౌరవం పెరగాలి. ఆడ మగ అనే విచక్షణ పాటించకుండా స్త్రీ పురుషులు ఇద్దరు సమాజ ప్రగతి రథానికి చక్రాలలాంటి.వారని సమాజం భావించాలి. సాంప్రదాయకంగా మహిళలు ఇంటికి ఇంటి వ్యవహారాలకు పరిమితం కావాలన్న భావన కుటుంబాలు విడనాడాలి. స్త్రీ పురుష సమానత్వం సమాన అవకాశాల కల్పన కుటుంభం నుండే ప్రారంభం కావాలి. నూతన విద్యా విధానంలో లింగ వివక్షత స్త్రీ పురుష అసమానతలు రూపు మాపే సమానత్వం సమాన అవకాశాల మీద పాఠ్యాంశాలు ప్రవేశ పెట్టీ విద్యార్థి దశలోనే లింగ సమానత్వ సాధనకు ఉపకరించే విద్యా పాలన సంస్కరణలు అమలు చెయ్యాలి.

సమర్థత నైపుణ్యాలతో స్త్రీ పురుషుల
మధ్య విచక్షణను కట్టడి చేయాలి
మీడియా సినిమా పత్రిక ప్రసార మాధ్యమాలు మహిళలను కించ పరిచేలా దృశ్యాలను చిత్రీకరించవద్దు. మహిళా విలువలను తక్కువ చేసి చూపించే నాటికలు నాటకాలు సీరియళ్లు నిషేధించాలి.
మహిళా సంక్షేమమే ధ్యేయంగా స్త్రీ జాతి ప్రతిష్టను కాపాడుకోవడంలో మహిళలు గురుతర బాధ్యత పోషించాలి. అధికార పార్టీలు తమ గెలుపులో సగా భాగమైన స్త్రీ ల రుణం తిరుచుకోవడనికి ఆరోగ్యం విద్య వైద్యం ఉపాధి శిక్షణ తదితర రంగాలలో దీర్ఘకాలిక సాధికారిత ను సాధించే పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చెయ్యాలి. కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన చట్టాలు హక్కులు తమ రక్షణకు ఉపయోగ పడతాయని విశ్వాసం స్త్రీలకు కలిపించాలి. విద్య వైద్యం పోషకాహారం అన్ని రంగాలలో సరైన న్యాయం కల్పించాలి. మెరుగైన జీవన ప్రమాణాల పెరుగుదలకు చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల ఉపయోగ‌పడతాయి. మానవీయ కోణంలో లింగ సమానత్వం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక మహిళాభివృది వ్యూహాలను రూపొందించింది అమలు చేయాలి. మహిళాభివృద్దే మానవాభి వృద్ది లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర మహిళావికాసానికి‌ ఉపక్రమిస్తుందని ఆశిద్దాం.

(నేదునూరి కనకయ్య)
తెలంగాణ ఎకనామిక్ ఫోరం-అధ్యక్షులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *