తొలి టెస్టులో భారత్ ఘన విజయం
స్పిన్నర్ల ధాటికి చేతులెత్తేసిన ఆసీస్
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విశ్వం న్యూస్) : తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 132 పరుగులతో కంగారూలను చిత్తు చిత్తుగా ఓడించింది. అశ్విన్(5), జడేజా(2), అక్షర్(1) స్పిన్ ధాటికి రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 91 పరుగులకే కుప్పకూలింది. చివర్లో షమి రెండు వికెట్లు తీశాడు. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ (25*) టాప్ స్కోరర్. అంతకు ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 177. భారత్ తొలి ఇన్నింగ్స్: 400. ఈమ్యాచ్లో షమి ఓ అరుదైన ఫీట్ సాధించాడు. టెస్టు క్రికెట్లో 25 సిక్సులతో ఫుల్ టైం బ్యాటర్ కోహ్లీ (24 సిక్సులు)ని అధిగమించాడు.