రానా, సురేష్ బాబులపై కేసు నమోదు

రానా, సురేష్ బాబులపై కేసు నమోదు

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విశ్వం న్యూస్) : నిర్మాత డి.సురేష్ బాబు, ఆయ‌న త‌న‌యుడు, రానా ద‌గ్గుబాటిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఫిల్మ్ న‌గ‌ర్‌కు సంబంధించిన భూ వివాదంలో డి.సురేష్ బాబు, రానాలు త‌న‌న‌ను రౌడీల‌తో బెదిరించార‌ని ప్ర‌మోద్ కుమార్ అనే వ్య‌క్తి ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ నగర్‌లోని కో ఆపరేటివ్ సోసైటీ పరిధిలో 1007 గజాల స్థలానికి సంబంధించిన వివాదం నడుస్తుంది. ఈ స్థలం విషయంలో రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సురేష్ బాబు నడుచుకోవటం లేదని , తమ వద్ద డబ్బు తీసుకున్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించటం లేదని బంజారా హిల్స్‌కి చెందిన ప్రమోద్ కుమార్ అనే బిజినెస్ మ్యాన్ నాంపల్లి కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *