ఇదేనా విశ్వనగరం..?

ఇదేనా విశ్వనగరం..?

  • విశ్వనగరం హైదరాబాద్లో సమాధానం లేని ప్రశ్న-పరిష్కారం లేని సమస్య
  • ఎలక్ట్రిసిటీ వైర్ అడ్డం వస్తున్నాయని చెట్ల కొమ్మలను కొట్టేసిన తర్వాత ఎవరు తీసుకొని వెళ్తారు??

హైదరాబాద్, ఆగస్టు 16 (విశ్వం న్యూస్) : ఈ ప్రశ్నకు అధికారుల దగ్గర సమాధానం ఉండదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అడిగితే ప్రజల వద్ద బిల్లులు సేకరించడానికి సిబ్బంది సరిపోవట్లేదు, ట్రాక్టర్ లేదు మేము పరిష్కరించలేము కాబట్టి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సహాయం తీసుకోండి అని అంటారు; హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ని అడిగితే ఐదు డివిషన్ కి కలిపి ఒక్క ట్రాక్టర్ చాలా తక్కువ సిబ్బంది ఉంది కాబట్టి పరిష్కరించడం కష్టం కాబట్టి శానిటైజేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయం తీసుకోండి అని అంటారు.

శానిటైజేషన్ డిపార్ట్మెంట్ ని అడిగితే రోజు రోడ్లు ఉడవడానికి చెత్త సేకరించడానికి సిబ్బంది సరిపోవటం లేదు చెత్త ఎత్తడానికి ట్రాక్టర్లు, రిక్షాలు కూడా లేవు ఈ చెట్ల కొమ్మలను సేకరిస్తే మా రోజు వారి పనులకు ఇబ్బంది కలుగుతుంది అని వాళ్ళు చేతులెత్తేస్తారు అలాంటప్పుడు సమయానికి పన్నులు చెల్లిస్తున్న ప్రజలు ఏమి చేయాలి??

విశ్వ నగరం అని గొప్పగా చెప్పుకునే మన హైదరాబాద్ నగరంలో కనీసం ఆకుపచ్చ వ్యర్థాలు సేకరణకు క్లారిటీ లేదు, సిబ్బంది లేదు, వ్యవస్థ లేదు. ఇలా అంతుచిక్కని సమస్యగా మారిపోయింది.

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కేవలం ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా ప్రభుత్వ భూములను అమ్ముకోవడానికి కమిషన్ల కోసం ప్రాజెక్టుల పైన శ్రద్ధ చూపిస్తున్నారు. కానీ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇలాంటి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *