బీఎస్పీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిగా జక్కని సంజయ్ కుమార్
బీఎస్పీ కరీంనగర్ పార్లమెంట్
నియోజకవర్గ ఇంచార్జిగా
జక్కని సంజయ్ కుమార్

- బీఎస్పీ రాష్ట్ర OBC విభాగం చైర్మన్ గా అవకాశం
- ప్రకటించిన బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
కరీంనగర్, (విశ్వం న్యూస్) : బహుజన్ సమాజ్ పార్టీ OBC విభాగం రాష్ట్ర చైర్మన్ గా, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిగా బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధి గా పని చేస్తున్న కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం, మొలంగూర్ గ్రామానికి చెందిన జక్కని సంజయ్ కుమార్ ను నియమిస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు.
జక్కని సంజయ్ కుమార్ గతంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా పని చేసి, 7 సంవత్సరాలుగా బీసీ ఉద్యమకారుడిగా, రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు, బీఎస్పీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, రాష్ట్ర కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా పని చేస్తున్నారు, పార్టీ ఉత్తర తెలంగాణ ఇంచర్జిగా, మునుగోడు ఎన్నికల సమయంలో పార్టీ ఎన్నికల స్టార్ కంపెనార్ గా పని చేశారు, రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేస్తూన్న సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ఇంచార్జిగా పని చేస్తున్నారు, ఎంతో నమ్మకంగా పార్టీ కోసం నిరంతరం పని చేస్తున్న తనుకు పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంన్చార్జిగా అవకాశం కల్పించారు.
ఈ సందర్బంగా జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ నామీద నమ్మకంతో నాకు బీఎస్పీ రాష్ట్ర OBC విభాగం రాష్ట్ర చైర్మన్ గా, కరీంనగర్ పార్లమెంటు ఇంచార్జిగా అవకాశం కల్పించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, నియమానికి సహాయ, సహకారాలు అందించిన రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ మరియు వివిధ మండలాల పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమని బలోపేతం చేస్తూ, నిర్మాణంలో భాగంగా పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని స్థాయిలలో పూర్తి కమిటీలు నిర్మిస్తూ అందరికి అందుబాటులో ఉంటూ అందరిని కలుపుకొని నిరంతరం ఉద్యమిస్తానని అన్నారు.
అలాగే పార్టీ బలోపేతం చేసి స్థానిక సంస్థలను మొదలుకొని, ఎమ్మెల్యే, ఎంపీగా బీఎస్పీని గెలిపించి కరీంనగర్ గడ్డ బహుజనుల అడ్డ అని నిరూపించి దొరల గడిలలో బంది అయిన బహుజన నాయకులను విముక్తి చేస్తామని, అని తెలిపారు.
