అభివృద్ధి నిర్మాణ రంగంలో
ఇంజనీర్ల పాత్ర గొప్పది

తిమ్మాపూర్, సెప్టెంబర్ 16 ( విశ్వం న్యూస్ ): కరీంనగర్ జిల్లా కన్సల్టెంట్ సివిల్ ఇంజనీర్స్, ఆర్కిటెక్చర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ లోని శ్వేత హోటల్ లో ప్రముఖ ఇంజనీర్ డా.మోక్షగుండం విశ్వేశ్వరయ్య 163వ జయంతి పురస్కరించుకొని ఇంజనీర్స్ డే వేడుకల ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా.. మేయర్ వై.సునీల్ రావు, అతిథిగా ప్రముఖ ఇంజనీర్ అజయ్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా ఇంజనీర్స్ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం అని, నైపుణ్యం, కొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కర ణలతో యువ సివిల్ ఇంజనీర్స్ అద్భుతాలు సృష్టిస్తున్నారని, నేటి నిర్మాణ రంగంలో ఇంజనీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో ఇంజనీర్లు ప్రముఖ పాత్ర పోషించారని, దేశ అభివృద్ధికి సివిల్ ఇంజనీర్స్ మూలకారకులని కొనియాడారు.

ఈ సందర్భంగా కరీంనగర్ కన్సల్టెంట్ సివిల్ ఇంజనీర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగర మేయర్ వై.సునీల్ రావు ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కన్సల్టెంట్ సివిల్ ఇంజనీర్స్, ఆర్కిటెక్చర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ సబాని శ్రీనివాస్, అధ్యక్షులు ఈగల రాజేందర్, జనరల్ సెక్రెటరీ గడ్డం హరికిషన్, ట్రెజరర్ బీమనాతిని రంజిత్ కుమార్, నల్ల లక్మ్మయ్య, కొల అన్నారెడ్డి, మర్రి రాజేష్, పాక పవన్ కృష్ణ, అనిల్, ప్రశాంత్, ప్రమోద్, వెంకటేష్, సురేష్ బాబు తో పాటు అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, సభ్యులు, యువ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.